కాబోయేవాడు అలాగే ఉండాలి.. కృతి మనసులో మాటలివీ!

తొలిసారి ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది కృతి సనన్‌. ఆమె నటిస్తూ, నిర్మిస్తున్న ‘దో పత్తి’ 

అక్టోబరు 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. 

‘బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్’పేరుతో కృతి సనన్ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది. అందులోనే ‘దో పత్తి’ తెరకెక్కింది. 

ఈ సినిమా కోసం రోజుకు దాదాపు 17 గంటలు పనిచేశానని కృతి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

‘జీవితంలో ఎంత సాధించినా ఆ ఆనందాన్ని పంచుకోవడానికి మనకంటూ ఓ వ్యక్తి ఉండాలి. మన పక్కన అలా ఎవరూ లేనప్పుడు ఎంత సాధించినా.. విజయం అందుకోనట్లే’ అంటోంది కృతి.

‘నువ్వు ఏం చదువుకున్నా ఫర్వాలేదు కానీ ఉద్యోగమో, వ్యాపారమో తప్పక చేయాలి. ప్రతి స్త్రీకీ ఆర్థిక స్వాతంత్ర్యం ఉండి తీరాలి అని అమ్మ చెప్పేది. ఆ మాటలే నాకు స్ఫూర్తి’ అంది కృతి. 

‘కాబోయేవాడు కచ్చితంగా నా కంటే హైట్‌ ఉండాలి. నా వృత్తిని గౌరవించాలి. మాటల్లోనే కాదు మౌనంలోనూ అతడితో నేను ఆనందంగా గడపగలగాలి’ అని మనసులో మాట చెప్పింది. 

పచ్చని ప్రకృతిలో రోజూ ఉదయం టీ తాగుతూ సేదతీరడం అంటే ఇష్టపడుతుంది. 

‘మిమీ’లో నటనకుగాను ఇటీవల జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. 

‘చిన్నతనంలో నేర్చుకున్న కథక్‌ను రోజూ సాధన చేస్తా. నేను సన్నగా ఉండటానికి అదీ ఓ కారణం’ అని ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ తెలిపింది. 

హద్దులు లేని కలలు కనడం ఇష్టం. సినిమాల్లోకి రాకముందు సల్మాన్‌ ఖాన్‌తో మొదటి సినిమా చేయాలనుకున్నా. ఇప్పటికీ అది కలగానే ఉంది - కృతి

బోల్డ్‌ సన్నివేశాల్లో నటించను. అలాంటి పరిస్థితి వస్తే అమ్మనే సలహా అడుగుతా అని చెప్పింది.

కృతికి బ్లాక్‌ కలర్‌ అంటే ఇష్టం. మోడ్రన్‌ డ్రెస్సులు ధరించి సోషల్‌ మీడియాలో ఆ ఫొటోలను షేర్‌ చేస్తుంది.

హ్యాపీ ఫ్యామిలీ కోసం పాటించండివి

చీరల్లో ఉండే గ్రేసే వేరబ్బా: అనన్య నాగళ్ల

ప్రధాని రష్యా పర్యటన.. ఆ దేశం గురించి తెలుసా?

Eenadu.net Home