అక్కా నేను కలిస్తే సందడే సందడి..

‘ద అర్చీస్‌’తో గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో అలరించిన ఖుషీ కపూర్‌ ప్రస్తుతం మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది.

ఇబ్రహిం అలీఖాన్‌ హీరోగా వస్తోన్న ‘నాదనియాన్‌’లో ఖుషీ నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. 

‘ఫాబ్యులస్‌ లివ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌ వైవ్స్‌’ అనే వెబ్‌సిరీస్‌లో అతిథి పాత్రతో ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది ఖుషి.

‘భస్మ్‌ హో: ప్యార్‌ కా తక్రర్‌’తో 2016లో నటన మొదలు పెట్టింది. ‘స్పీక్‌ అప్‌’ అనే షార్ట్‌ఫిల్మ్‌లోనూ చేసింది.

ఇటీవల ఈమె పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. దానికి హాజరైన తన స్నేహితులంతా ‘కేకే’ అనే ఎంబ్రాయిడరీ చేసిన పైజామాలను ధరించారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

‘జిగ్రా’ నటుడు వేదాంగ్‌ రైనాతో ఖుషి ప్రేమలో ఉన్నట్లు వార్త వైరల్‌ అవుతోంది. ఖుషి బర్త్‌డే పార్టీకి వేదాంగ్‌ హాజరు కావడంతో రిలేషన్‌ నిజమేనంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి.

‘అక్కా నేను కలిస్తే అల్లరే అల్లరి.. మమ్మల్నెవ్వరూ ఆపలేరు. ఇద్దరం అర్ధరాత్రి వరకూ స్విమ్మింగ్‌ చేస్తాం’ అని సోదరి జాన్వీ కపూర్‌తో చేసే సరదాలు వివరించింది.

ఖుషి జంతు ప్రేమికురాలు.. ఇంట్లో నాలుగైదు పెంపుడు శునకాలు ఉన్నాయి. తరచూ వాటితో ఫొటోలు దిగుతూ ఉంటుంది.

ఐలాండ్స్‌, సన్‌సెట్‌ బీచ్‌, స్నేహితులతో పార్టీలు ఇవే ఖుషి ఫేవరెట్స్‌.. ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ అయితే స్విమ్మింగే అని అంటోంది.  

బోర్‌ కొట్టినప్పుడల్లా పెయింటింగ్‌ చేస్తుంది. ఇది తన ఒత్తిడిని తగ్గించడంతో పాటు సంతోషాన్నీ ఇస్తుందంటోంది ఖుషీ. 

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home