తొలి ప్రయత్నంలోనే.. ఆస్కార్ ముంగిట
నటించిన మొదటి సినిమానే ఆస్కార్ స్థాయికి వెళితే ఆ ఆనందమే వేరు కదా.. ఆ ఆనందం ఇప్పుడు ప్రతిభా రత్న వంతు.
ప్రతిభా రాణి ప్రధాన పాత్రలో నటించిన ‘లాపతా లేడీస్’ ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేట్ అవ్వడానికి రేసులో ఉంది.
‘కురబాన్ హువా’ సీరియల్ ద్వారా 2020లో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చింది ప్రతిభ. నాలుగేళ్ల పాటు టెలివిజన్‌లో అలరించింది.
‘లాపతా లేడీస్’తో వెండితెరపై అడుగుపెట్టింది. సంజయ్‌లీలా భన్సాలీ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘హీరామండి’లోనూ శమ పాత్రలో ప్రతిభా రాణి నటించింది.
2000లో హిమాచల్‌ప్రదేశ్‌లో పుట్టిన ప్రతిభ.. చదువు నిమిత్తం సిమ్లాకు షిఫ్టు అయ్యింది.
ముంబయిలో ఫిల్మ్ మేకింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. నృత్యంలో శిక్షణ తీసుకొని స్టేజీపై ప్రదర్శనలూ ఇచ్చింది.
స్కూల్లో చదువుకునే రోజుల్లోనే రంగస్థలంలో నటించింది. నటనపై ఆసక్తితో సోదరితో కలసి సిమ్లా నుంచి ముంబయికి వచ్చేసింది.
ప్రతిభకు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువ. ఆసనాలు, స్టంట్‌లతో ఎప్పుడూ ఫిట్‌గా ఉండే ప్రయత్నం చేస్తుంది.