వెండితెరపై లేడీ సూపర్‌స్టార్స్
#Eenadu
కంగనా రనౌత్
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్.. ఫ్యాషన్, క్వీన్, రంగూన్, సిమ్రన్, మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ, తలైవి, ధాకడ్ తదితర చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. సూపర్‌స్టార్ అనిపించుకుంది.
Image: Instagrm
నయనతార
దక్షిణాది చిత్రసీమల్లో స్టార్ హీరోలందరితో నటించిన నయన్.. అనామిక, మయూరి, వాసుకి, కర్తవ్యం, కో కో కోకిల, ఐరా, అంజలి సీబీఐ, అమ్మోరు తల్లి, ఓ2 ఇలా వరుసపెట్టి మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ లేడి సూపర్‌స్టార్‌గా ఎదిగింది.
Image: Instagrm
విద్యాబాలన్
మొదటి నుంచి వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ బీటౌన్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది విద్యాబాలన్. ది డర్టీ పిక్చర్, కహానీ, బాబీ జాసూస్, బేగమ్ జాన్, తుమ్హారి సులు, శకుంతల దేవి, షేర్ని తదితర చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించి ఆకట్టుకుంది.
Image: Instagrm
తాప్సీ
గ్లామరస్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. విమెన్‌సెంట్రిక్ సినిమాలతో దూసుకెళ్తోంది తాప్సీ. పింక్, నామ్ షబానా, ఆనందో బ్రహ్మ, ముల్క్, బద్లా, థప్పడ్, హసీన్ దిల్రుబా, శభాష్ మిథు తదితర చిత్రాల్లో నటించింది తాప్సీ.
Image: Instagrm
సోనాక్షి సిన్హా
బాలీవుడ్ బ్లాక్‌బాస్టర్ ‘దబాంగ్’తో ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి.. మొదట్లో హీరోలతో ఆడిపాడి.. ఆ తర్వాత సోలోగా కథలను నడిపిస్తోంది. అఖీరా, నూర్, హ్యప్పీ ఫిర్ భాగ్ జాయేగి, డబుల్ ఎక్స్.ఎల్ చిత్రాల్లో మెరిసింది.
Image: Instagrm
అనుష్క శెట్టి
నాగార్జున ‘సూపర్’తో హీరోయిన్‌గా పరిచయమైన అనుష్క.. ‘అరుంధతి’తో లేడీ సూపర్‌స్టార్‌గా మారింది. రుద్రమ దేవి, సైజ్ జీరో, పంచాక్షరి, భాగమతి, నిశ్శబ్దం తదితర చిత్రాల్లో ప్రధాన పోషించి సూపర్ అనిపించుకుంది.
Image: Instagrm
ఆలియా భట్
స్టార్‌కిడ్‌గా సినిమాల్లోకి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆలియా భట్. ‘హైవే’,‘ఉడ్తా పంజాబ్’లో ఆలియా భట్ నటనకు ప్రశంసలు దక్కాయి. డియర్ జిందగీ, రాజీ, గంగూబాయి: కఠియావాడి, డార్లింగ్స్‌లో తన పాత్రలతో ఆకట్టుకుంది.
Image: Instagrm
కీర్తి సురేశ్
‘నేను శైలజ’లో బబ్లీ హీరోయిన్‌గా కనిపించిన కీర్తి.. ‘మహానటి’తో సావిత్రిలాగే సూపర్‌స్టార్ అనిపించుకుంది. ఆ తర్వాత పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, చిన్ని వంటి విమెన్‌సెంట్రిక్ చిత్రాల్లో నటించింది.
Image: Instagrm
గతంలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి.. కర్తవ్యం, రేపటి పౌరులు, ఓసేయ్ రాములమ్మ తదితర చిత్రాల్లో నటించి టాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ అనిపించుకున్నారు.
Image: facebook