నదుల్లో కాగితపు దివ్వెల కాంతులు.. 

వియత్నాంలోని సంస్కృతీ సంప్రదాయాలు.. పండగలు పర్యాటకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. వాటిలో ఒకటి ‘లాంతర్‌ రివర్‌’ ఫెస్టివల్‌.

హోయ్‌ అన్‌, నుయే నదుల పరిసర ప్రాంతాల ప్రజలు ప్రతి నెలా పౌర్ణమికి స్వాగతం పలుకుతూ ముందు రోజును వేడుకలా చేసుకుంటారు. 

ఆ రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత ప్రజలు కాగితంతో చేసిన పువ్వుల్లో దీపాలు వెలిగించి నదిలో వదులుతారు.

కొందరు ఒడ్డున నిల్చొని దీపాలను వదిలితే.. మరికొందరు పడవల్లో నది మధ్యలోకి వెళ్లి వదులుతుంటారు. 

ఇలా చేయడం వల్ల తమకు మంచి జరుగుతుందని, పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయని అక్కడి ప్రజల విశ్వాసం.

నదిలో కాగితపు పువ్వు దివ్వెలను వదిలే సంప్రదాయం 400 ఏళ్ల కిందటే మొదలైందట. ఇప్పటికీ అది కొనసాగుతోంది.

మహిళలు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేస్తుంటే.. వెన్నెల కాంతిలో నదిపై కాగితపు దీపాలు కనువిందు చేస్తాయి. 

ఈ వేడుకను చూసేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీంతో ఇవి టూరిస్ట్‌ ప్రాంతాలుగా మారిపోయాయి. 

పర్యాటకులు కూడా దివ్వెలను నదిలో వదలొచ్చు.. దీప కాంతుల మధ్య ఆ నదిలో పడవ ప్రయాణాన్ని ఆస్వాదించొచ్చు. 

వీధుల్లో కాగితపు దీపాల తోరణాల అలంకరణ భలే ఉంటుంది. పర్యాటకులు అక్కడి సంప్రదాయ వంటకాలనూ రుచి చూడొచ్చు.

‘వరల్డ్స్‌ లోన్లీయెస్ట్‌ హౌస్‌’ గురించి తెలుసా?

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

Eenadu.net Home