వన్డే ప్రపంచకప్‌లో అతిపెద్ద విజయాలివే..

ఇదే బెస్ట్ 

తాజాగా వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇదే ప్రపంచకప్‌ టోర్నీల్లోనే అత్యుత్తమ విజయం. ఓవరాల్‌గా రెండో గొప్ప విజయం.

మళ్లీ ఆసీస్‌దే..

2015 వరల్డ్‌ కప్‌లో అఫ్గానిస్థాన్‌పై ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత ఆసీస్‌ 417/6 స్కోరు చేయగా.. అఫ్గాన్‌ 142 పరుగులకే కుప్పకూలింది. 

ఆ తర్వాత భారత్‌

2007 వరల్డ్ కప్‌లో బెర్ముడాపై భారత్ 257 పరుగుల తేడాతో గెలిచింది. టీమ్ఇండియా 413/5 స్కోరు చేసింది. అనంతరం బెర్ముడా 156కే ఆలౌటైంది. వన్డేల్లో ఓవరాల్‌గా భారీ విక్టరీ నమోదు చేసిన జట్టు కూడా

టీమ్‌ఇండియానే. శ్రీలంకపై 2023 జనవరిలో భారత్ 317 పరుగుల తేడాతో గెలిచింది. 

వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా

బలమైన వెస్టిండీస్‌పైనా దక్షిణాఫ్రికా 257 పరుగుల భారీ తేడాతో విజయం నమోదు చేసింది. 2015 వరల్డ్‌ కప్‌లో దక్షిణాఫ్రికా 408/5 స్కోరు చేయగా.. విండీస్‌ 151 పరుగులకే పరిమితమైంది. ఇది 2015 వరల్డ్‌ కప్‌లో చోటు చేసుకుంది.

నమీబియా 45కే ఆలౌట్

వన్డే ప్రపంచకప్ 2003 టోర్నీలో నమీబియాపై ఆస్ట్రేలియా 256 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదే మ్యాచ్‌లో నమీబియా 45 పరుగులకే ఆలౌటైంది. తొలుత ఆసీస్‌ 301/6 స్కోరు చేసింది.

శ్రీలంక రికార్డు

2007 వన్డే ప్రపంచకప్‌లో బెర్ముడాపై శ్రీలంక భారీ విజయం నమోదు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 321/6 స్కోరు చేసింది. అనంతరం బెర్ముడా 78 పరుగులకే కుప్పకూలింది.

నెదర్లాండ్స్‌పై దక్షిణాఫ్రికా

2011 వరల్డ్‌ కప్‌లో నెదర్లాండ్స్‌ను 231 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సఫారీ జట్టు 351/5 స్కోరు చేసింది. అనంతరం నెదర్లాండ్స్‌ను 120 పరుగులకే ఆలౌట్‌ చేసింది.

ఈసారి ఆసీస్‌

2007 వరల్డ్‌ కప్‌లో నెదర్లాండ్స్‌ను ఆసీస్ 229 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత ఆసీస్‌ 358/5 భారీ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్‌ 129 పరుగులకే పరిమితమైంది.

మళ్లీ నెదర్లాండ్స్‌పైనే

2007 వరల్డ్‌ కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలోనూ నెదర్లాండ్స్‌కు ఘోర పరాభవం తప్పలేదు. ఏకంగా 221 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. దక్షిణాఫ్రికా చేసిన 353/3 స్కోరుకు సమాధానంగా నెదర్లాండ్స్ 132/9 స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది.

కివీస్‌ను చిత్తు చేసిన ఆసీస్‌

కివీస్‌ వంటి బలమైన జట్టును ఆసీస్‌ 215 పరుగుల తేడాతో ఆసీస్‌ ఓడించడం గమనార్హం. ఇది 2007 వరల్డ్‌ కప్‌లో చోటు చేసుకుంది. తొలుత ఆసీస్‌ 348/6 స్కోరు చేసింది. అనంతరం కివీస్‌ 133 పరుగులకే ఆలౌటైంది.

ఒలింపిక్స్‌ గురించి ఆసక్తికర విషయాలు

శ్రీలంక పర్యటనలో భారత్‌.. ఎప్పుడు ఏ మ్యాచ్‌ అంటే?

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

Eenadu.net Home