తమన్నా.. ప్రేమ.. సినిమా..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన తమన్నా.. తగ్గేదేలే అన్నట్టు.. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చాలా బిజీగా ఉంటోంది.
Image: Instagram/Tamannaah Bhatia
ఓ వైపు సినిమాలు.. మరోవైపు ఓటీటీ కథలు, ఫొటోషూట్స్, విజయ్ వర్మతో ప్రేమాయణం ఇలా వివిధ కారణాలతో సోషల్‌మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Image: Instagram/Tamannaah Bhatia
‘శ్రీ’తో తెలుగుతెరపై ఎంట్రీ ఇచ్చి.. ‘హ్యాపీడేస్’తో పాపులరై.. ‘100% లవ్’తో స్టార్ హీరోయిన్‌గా మారింది తమన్నా. తెలుగులో అగ్ర హీరోలకు జోడీగా నటించింది.
Image: Instagram/Tamannaah Bhatia
‘ఊసరవెల్లి’, ‘రచ్చ’, ‘రెబల్’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఆగడు’, ‘బెంగాల్ టైగర్’, ‘బాహుబలి’, ‘ఎఫ్ 2 & 3’ తదితర చిత్రాల్లో నటించిన తమన్నా తమిళ, హిందీ చిత్రాల్లోనూ మెరిసింది.
Image: Instagram/Tamannaah Bhatia
ఇటీవల ఈ మిల్కీ బ్యూటీ నటించిన ‘జీ కర్దా’ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ఆకట్టుకుంటోంది.
Image: Instagram/Tamannaah Bhatia
ఈ భామ నటించిన మరో ఓటీటీ చిత్రం ‘లస్ట్ స్టోరీస్ 2’ జూన్ 29న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకానుంది. ఇందులో తమన్నా కాస్త బోల్డ్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Image: Instagram/Tamannaah Bhatia
ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇందులో తమన్నా లాయర్‌గా కనిపించనుంది.
Image: Instagram/Tamannaah Bhatia
మరోవైపు తమిళ్‌లో రజనీకాంత్ ‘జైలర్’లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.
Image: Instagram/Tamannaah Bhatia
చాలాకాలంగా తమన్నా.. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఇటీవల తమన్నానే బయటపెట్టింది. వీరిద్దరు కలిసి‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించారు.
Image: Instagram/Tamannaah Bhatia
తను నటించిన వెబ్‌సిరీస్, సినిమాల ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటూనే ఫొటోషూట్స్‌లోనూ పాల్గొంటోంది. తన గ్లామర్ ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది.
Image: Instagram/Tamannaah Bhatia