వాట్సప్‌లో ఈ నయా ఫీచర్లు ట్రై చేశారా?
యూజర్ల అభిరుచులకు తగ్గట్లు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకురావడంలో వాట్సప్ ముందుంటుంది. అలా ఈ ప్లాట్‌ఫామ్ ఇటీవల తీసుకొచ్చిన ఈ ఫీచర్లను ట్రై చేశారా?
ఏఐ చాట్‌బాట్
మెటా తీసుకొచ్చిన ఏఐ చాట్‌బాట్ సాయంతో ఏ విషయాన్నైనా అక్కడే సెర్చ్ చేయొచ్చు. మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో తెలియజేస్తే సంబంధిత ఏఐ చిత్రాన్ని జనరేట్ చేసి మీ ముందుంచుతుంది.
ఫేవరెట్స్
వాట్సప్ నావిగేషన్‌ను సులభతరం చేస్తూ తీసుకొచ్చిన ‘ఫేవరెట్స్’ ఫీచర్‌తో మీకు నచ్చిన వ్యక్తులను ఈ లిస్ట్‌లో యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన పేర్లు చాట్, కాల్స్ ట్యాబ్‌లో కనిపిస్తాయి. దీంతో ముఖ్యమైన మెసేజ్‌లు మిస్ అయ్యే అవకాశమే ఉండదు.
గ్రూప్ కాల్
గరిష్ఠంగా 32 మందితో వీడియో కాల్ చేసే సదుపాయాన్ని వాట్సప్ తీసుకొచ్చింది. అన్ని డివైజుల్లోనూ ఈ సదుపాయం పనిచేస్తుంది. స్క్రీన్- షేరింగ్ ఫీచర్‌నూ ప్రవేశపెట్టింది.
ఈవెంట్ ప్లాన్
వాట్సప్ కమ్యూనిటీలో తీసుకొచ్చిన కొత్త సదుపాయమే ఈవెంట్ ప్లాన్. గ్రూప్ సభ్యుల పుట్టినరోజు పార్టీలు, వర్క్ మీటింగ్‌లను సెటప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
గ్రూప్ చాట్ ఫిల్టర్
అన్‌రీడ్, గ్రూప్ అంటూ వాట్సప్‌లో ప్రత్యేక ట్యాబ్‌లను వాట్సప్ తీసుకొచ్చింది. కమ్యూనికేషన్ అనుభవం మరింత మెరుగుపర్చేందుకు వీటిని తీసుకొచ్చింది.
ప్రైవేట్ వాయిస్ మెసేజెస్
ఓన్లీ వన్స్ ఫొటో ఫీచర్‌లాగే వాయిస్ మెసేజ్‌లకు భద్రత జోడించింది. అంటే ఒకసారి ఆడియోను ప్లే చేశాక ఆ మెసేజ్ ఆటోమేటిక్‌గా చాట్ నుంచి తొలగిపోతుంది. సేవ్ చేసుకొనే అవకాశం లేదు.
స్కామ్ కాల్స్‌కు చెక్
స్కామ్/ స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు వాట్సప్ సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్‌ను తీసుకొచ్చింది. ఎవరైనా కొత్త నంబర్ నుంచి కాల్ చేస్తే సదరు యూజర్‌కు రింగ్ రాకుండా ఈ ఫీచర్ నిరోధిస్తుంది.
ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ ఖాతాలు
ఒకే మొబైల్‌లో రెండు వాట్సప్ ఖాతాల్ని వినియోగించుకొనే సదుపాయాన్ని మెసేజింగ్ యాప్ తీసుకొచ్చింది. రెండు సిమ్‌కార్డ్‌లు ఉండీ రెండు ఖాతాలు ఉపయోగించాలనుకునే వారికి ఇది ప్రయోజనకరం.
సీక్రెట్ కోడ్
గోప్యతను పెంచేందుకు ప్రైవేట్ చాట్‌లకు సెక్యూరిటీ కోడ్ సెట్ చేసేందుకు సదుపాయం కల్పించింది. ఇంతకీ ఈ ఫీచర్లు మీరు ట్రై చేశారా?