డ్రై ప్రమోషన్‌.. కాఫీ బ్యాడ్జింగ్‌.. ఈ ట్రెండ్స్‌ తెలుసా?

పని ప్రదేశం ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటోంది. కార్పొరేట్‌ ప్రపంచంలో మారుతున్న టెక్నాలజీ, ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త ట్రెండ్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. 

ఇందులో కొన్ని ట్రెండ్స్‌ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. వాటి గురించి తెలుసా?

డ్రై ప్రమోషన్‌

సాధారణంగా ఉద్యోగంలో ప్రమోషన్‌ అంటే బాధ్యతలతో పాటు వేతనాలు, ఇతరత్రా ప్రోత్సాహకాలు పెరుగుతాయి. కానీ, అవేవీ లేకుండా కేవలం బాధ్యతలను మాత్రమే పెంచితే దాన్ని డ్రై ప్రమోషన్‌గా పేర్కొంటారు.

ప్రజెంటీయిజం

ఉద్యోగులు పనిచేసే వాతావరణం పట్ల అసంతృప్తి లేదా పనిపై దృష్టి కేంద్రీకరించకపోవడమే ‘ప్రజెంటీయిజం’. అంటే మనిషిక్కడున్నా.. మనసెక్కడో ఉండటం అన్నమాట. సరైన గౌరవం లభించకపోవడం, వర్క్‌- లైఫ్‌ బ్యాలెన్స్‌ చేయలేకపోవడం, పనికి తగ్గ గుర్తింపు రాకపోవడమే ఇందుక్కారణం.

కాఫీ బ్యాడ్జింగ్‌

కచ్చితంగా ఆఫీసుకు రావాలనే విధానాన్ని వ్యతిరేకిస్తూనే కార్యాలయానికి వచ్చి కాఫీ తాగుతూ సమయం గడపడమే ఈ కాఫీ బ్యాడ్జింగ్‌. మేనేజర్లు, ఉన్నతోద్యోగులు తమని గమనించేలా ప్రవర్తిస్తూ తమ నిరసనను తెలియజేయడమే దీని ఉద్దేశం.

ఆఫీస్‌ పికాకింగ్‌

వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతికి అలవాటుపడ్డ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడమే ఆఫీస్‌ పికాకింగ్‌. ఆఫీస్‌ను అందంగా అలంకరించడం, ఆకట్టుకునే సోఫాలు, ఫర్నిచర్‌తో ఓ విధంగా ఉద్యోగులకు ఎర వేయడం అన్నమాట. 

డిజిటల్‌ నొమాడిజమ్‌

ఉద్యోగులు తమకు నచ్చిన వాతావరణంలో రిమోట్‌గా పనిచేయడమే డిజిటల్‌ నొమాడిజమ్‌. రిమోట్‌గా పనిచేస్తూ నచ్చిన ప్రాంతానికి ప్రయాణించి టెక్నాలజీ సాయంతో పనిచేయడమే ఈ ట్రెండ్‌ ముఖ్య ఉద్దేశం.

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల్లో ఏ బ్యాంక్‌ వాటా ఎంత?

Eenadu.net Home