తక్కువ ధరలో లావా స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్లేమున్నాయంటే?

బడ్జెట్‌ ధరలో లావా నుంచి ‘లావా యువ ప్రో’ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది.

Image: Lava

దీంట్లో 6.51అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ డిస్‌ప్లే ఇచ్చారు. దీనికి కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ ఉంది.

Image: Lava

ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌తో పనిచేసే ఈ మొబైల్‌లో మీడియాటెక్‌ హీలియో ప్రాసెసర్‌ను వాడారు.

Image: Lava

ఇందులో 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు. ఎస్డీ కార్డుతో 512 జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.

Image: Lava 

వెనుకవైపు 13 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా ఇచ్చారు. ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

Image: Lava

బ్యాటరీ విషయానికొస్తే 10 వాట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. 320 గంటలపాటు స్టాండ్‌బై ఉంటుందని కంపెనీ చెబుతోంది.

Image: Lava

ఈ 4జీ మొబైల్‌లో సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌తోపాటు ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ కూడా ఉంది.

Image: Lava

బ్లాక్‌, గ్రే, బ్లూ రంగుల్లో లభించే ఈ మొబైల్‌ ధర రూ. 7,799. ప్రస్తుతం ఇది లావా ఆన్‌లైన్‌ స్టోర్‌లో మాత్రమే లభిస్తోంది.

Image: Lava

ఫొటోలో టెక్ట్స్‌నూ ట్రాన్స్‌లేట్ చేయొచ్చు

ఫోన్‌లో ఏ పార్ట్‌ ఎక్కడిదో తెలుసా..?

మీ పాస్‌వర్డ్‌ ఎంత స్ట్రాంగ్‌

Eenadu.net Home