పులి - మేక.. పోలీస్ లావణ్య!
‘అందాల రాక్షసి’తో కుర్రకారు మది దోచుకున్న క్యూట్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. యాక్షన్‌లోకి దిగింది.
Image: Instagram/Lavanya tripathi
తాజాగా ఈమె నటించిన ‘పులి మేక’ వెబ్‌సిరీస్ జీ5 ఓటీటీలో విడుదలైంది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టింది.
Image: Instagram/Lavanya tripathi
ఈ ‘హ్యాపీ బేబీ’ ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో పుట్టి.. ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో పెరిగింది.
Image: Instagram/Lavanya tripathi
చిన్నతనం నుంచే లావణ్యకి నటి అవ్వాలని కోరిక ఉండేదట. దీంతో చదువు కొనసాగిస్తూనే మొదట మోడలింగ్ చేసింది. టీవీ యాడ్స్‌లో నటించింది.
Image: Instagram/Lavanya tripathi
పలు అందాల పోటీల్లో పాల్గొన్న లావణ్య.. 2006లో ‘మిస్ ఉత్తరాఖండ్’ టైటిల్‌ను గెలుచుకుంది. హిందీలో కొన్ని టీవీ సీరియల్స్ చేసింది.. ఓ రియాల్టీ షోలోనూ పాల్గొంది.
Image: Instagram/Lavanya tripathi
స్నేహితుల సూచన మేరకు ‘అందాల రాక్షసి’ చిత్రం ఆడిషన్‌లో పాల్గొని హీరోయిన్‌గా అవకాశం కొట్టేసింది. ఇందులో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అవకాశాలూ వచ్చిపడ్డాయి.
Image: Instagram/Lavanya tripathi
అలా ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్’, ‘సొగ్గాడే చిన్నినాయనా’, ‘అంతరిక్షం’ తదితర చిత్రాల్లో నటించింది. ‘హ్యాపీ బర్త్‌డే’లో ద్విపాత్రాభినయం చేసి మెప్పించింది.
Image: Instagram/Lavanya tripathi
నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న లావణ్య.. కోలీవుడ్‌లోనూ రెండు సినిమాలు చేసింది. మరో సినిమా చిత్రీకరణ దశలో ఉంది.
Image: Instagram/Lavanya tripathi
కథ బాగుంటే ఏ హీరోతోనైనా నటిస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన లావణ్య.. కొరటాల శివ, రాజమౌళి, సుకుమార్ దర్శకత్వంలో నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టింది.
Image: Instagram/Lavanya tripathi
లావణ్యకి సామాజిక బాధ్యత ఎక్కువే. కరోనా సమయంలో ప్రభుత్వానికి విరాళమిచ్చిన మొదటి సినీతార తనే. సమాజానికి ఉపయోగపడే పలు ప్రచారచిత్రాల్లో రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించింది.
Image: Instagram/Lavanya tripathi
ఈ అందాల రాక్షసి భరతనాట్యం నేర్చుకుంది. దీంతో ‘భలే భలే మగాడివోయ్’లో తన నాట్య ప్రావీణ్యాన్ని ప్రదర్శించింది.
Image: Instagram/Lavanya tripathi
ఆ మధ్య వరుణ్ తేజ్‌తో లావణ్య ప్రేమలో పడిందని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. వాటిని ఈ భామ ఖండించింది. వరుణ్ తనకు మంచి స్నేహితుడని చెప్పింది.
Image: Instagram/Lavanya tripathi