మెగా కోడలు.. లావణ్య త్రిపాఠి
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు.
Image: Twitter
జూన్ 9న వరుణ్, లావణ్య నిశ్చితార్థం జరగనున్నట్లు వరుణ్‌తేజ్ సన్నిహితులు అధికారికంగా ప్రకటించారు.
Image: Twitter
మెగా కుటుంబంలో అడుగుపెట్టబోతోన్న లావణ్యకు నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Image: Instagram/Lavanya tripathi
‘మెగా ఫ్యామిలీలోకి వెల్‌కమ్ వదిన..’ అంటూ.. మెగా అభిమానులు లావణ్య ఇన్‌స్టా పోస్టుల్లో కామెంట్లు పెడుతున్నారు.
Image: Instagram/Lavanya tripathi
లావణ్య.. 1990 డిసెంబర్ 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించింది. ముంబయిలో ఎకనామిక్స్ నుంచి డిగ్రీ పట్టా పొందింది.
Image: Instagram/Lavanya tripathi
మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. పలు బ్రాండ్స్ ప్రచారచిత్రాల్లో నటించింది. తను క్లాసికల్ డ్యాన్సర్ కూడా. భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది.
Image: Instagram/Lavanya tripathi
స్నేహితుల సలహా మేరకు ‘అందాల రాక్షసి’ ఆడిషన్స్‌కు వెళ్లి.. హీరోయిన్‌గా ఎంపికైంది. ఆ చిత్రంలో లావణ్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
Image: Instagram/Lavanya tripathi
ఆ తర్వాత వరుసపెట్టి ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘రాధా’, ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ ‘చావు కబురు చల్లగా’ తదితర సినిమాల్లో నటించింది. పలు వెబ్‌సిరీస్‌లూ చేసింది.
Image: Instagram/Lavanya tripathi
‘మిస్టర్’లో లావణ్య తొలిసారి వరుణ్‌తేజ్‌తో కలిసి నటించింది. అప్పుడే వారిద్దరు మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత ‘అంతరిక్షం..’లో ఈ జోడీ రిపీటైంది.
Image: Instagram/Lavanya tripathi
చాలాకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. ఆ మధ్యలో లావణ్య దీనిపై ఘాటుగానే స్పందించింది. కానీ, క్లారిటీ ఇవ్వలేదు.
Image: Instagram/Lavanya tripathi
ఇటీవల మళ్లీ వరుణ్-లావణ్య డేటింగ్‌పై రూమర్స్ రాగా.. ఇద్దరూ ఖండించకపోవడంతో పెళ్లి ఖాయమని మెగా అభిమానులు, సినీప్రేక్షకులు ఫిక్సయ్యారు. ఇప్పుడు అదే నిజమైంది.
Image: twitter
ప్రస్తుతం వరుణ్‌తేజ్ ‘గాండీవధారి అర్జున’తో.. లావణ్య తమిళ చిత్రం ‘తానల్’తో బిజీగా ఉన్నారు. పెళ్లి ఎప్పుడనేది త్వరలో వెల్లడించనున్నారు.
Image: Instagram/Lavanya tripathi