పర్సే కాదు.. ఫోనూ లెదరే!

మొబైల్‌ యూజర్ల అభిరుచులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. దానికి తగ్గట్లుగానే స్మార్ట్‌ఫోన్లూ రూపుదిద్దుకుంటున్నాయి. అలా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండే లెదర్‌ బ్యాక్‌ ప్యానెల్‌.

మనం నిత్యం వాడే పర్సులానే స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ ప్యానెల్‌ కూడా లెదర్‌ ఫినిష్‌ ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో శాంసంగ్‌, వివో వంటి కంపెనీలు వీగన్‌ లెదర్‌తో కూడిన బ్యాక్‌ ప్యానెల్‌ను అందిస్తున్నాయి.

శాంసంగ్‌ ఇటీవల ఎఫ్‌55ని లెదర్‌ ఫినిష్‌తో తీసుకొచ్చింది. ఆరెంజ్‌ కలర్‌లో వచ్చిన ఈ ఫోన్‌ ఆకట్టుకుంటోంది. ఫోన్‌ ధర రూ.26,999.

వివో సంస్థ తన వై200 5జీ మోడల్‌ను లెదర్‌ ఫినిష్‌తో తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ ధర: రూ.19,999

 ఒప్పో ఇటీవల విడుదల చేసిన ఎఫ్‌ 27 ప్రో+ మోడల్లోనూ లెదర్‌ ఫినిష్‌ టచ్‌ ఇచ్చింది. రెండు రంగుల్లో ఈ ఫోన్‌ దొరుకుతుంది. ధర: రూ.27,999

మోటోరోలా ఎడ్జ్‌ 40 నియోలో రెండు రంగుల్లో లెదర్‌ ఫినిష్‌ను ఇచ్చింది. వద్దనుకున్న వారు ఇతర ఆప్షన్లు వినియోగించుకోవచ్చు. ధర: రూ.22,999

మోటో తన జీ84 మోడల్‌లోనూ లెదర్‌ ఫినిష్‌తో తీసుకొచ్చింది. ఈ పోన్‌ ధర: రూ.20వేలుగా ఉంది.

రియల్‌మీ 11 ప్రో, రియల్‌ మీ ప్రో ప్లస్‌ మోడళ్లలో వీగన్‌ లెదర్‌ ఫినిష్‌ ఉంది. వీటి ధరలు రూ.23,999, రూ.29,999.

మోటో తీసుకొచ్చిన బడ్జెట్‌ ఫోన్‌ జీ34 5జీలోనూ వీగన్‌ లెదర్ ఇచ్చారు. అతి తక్కువ ధరలో దీన్ని తీసుకురావడం విశేషం. దీని ధర రూ.10,999

లెదర్‌ ఫినిష్‌ ఫోన్లు చూడ్డానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. తాళం చెవులు, బ్లేడ్‌ వంటివి తగిలితే లుక్‌ దెబ్బతినే అవకాశం ఉంది.

ఈ యాపిల్‌ ఉత్పత్తులు ఇక కనిపించవ్‌!

ఏఐ రాణించలేని ఉద్యోగాలేంటో తెలుసా?

సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలను గుర్తించండిలా!

Eenadu.net Home