#eenadu

పొదుపునకు పక్కన పెట్టుకున్నాకే, ఖర్చులకు డబ్బు కేటాయించే పద్ధతిని పాటించడం ఉత్తమం. నెలవారీ ఆదాయం ఎంత.. ఏయే ఖర్చులున్నాయి? అన్న దానిపై అవగాహన కలిగి ఉండాలి.

సంపాదన, ఖర్చు.. సమానంగా ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఆర్థికంగా ఆనందంగా ఉండగలడు. అందుకే లెక్కలన్నింటినీ జాగ్రత్తగా నిర్వహించడం నేర్చుకోవాలి.

ముందుగా మీ నికర ఆదాయాన్ని లెక్కవేసుకోవాలి. పన్ను చెల్లించగా మిగిలిన మొత్తాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే సరైన ఆర్థిక ప్రణాళిక ఏర్పడుతుంది.

సంపాదన ప్రారంభంలో ఖర్చులు కాస్త తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇంటి అద్దె, రవాణా ఛార్జీలు, ఇతర ఖర్చులను రాసుకోవాలి. ఇలా చేస్తే దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామో తెలుస్తోంది.

ఆర్థిక భవిష్యత్తు బాగుండాలంటే అత్యవసరం కాని ఖర్చులు వాయిదా వేయాలి. నెలవారీ ఖర్చులు, నికర ఆదాయాన్ని లెక్కించాలి. ఆదాయానికి మించి ఖర్చులుంటే జాగ్రత్త పడాలి.

కొంతమంది ఎప్పుడో వచ్చే డబ్బును ఇప్పటి నుంచే ఆదాయంగా భావిస్తారు. దీనివల్ల ప్రస్తుత ఖర్చులు, అప్పులు రెండూ పెరుగుతాయి. ప్రస్తుత ఆదాయాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. 

కొన్నిసార్లు ఎంత పొదుపుగా ఉన్నా మనకు తెలియకుండానే డబ్బు ఖర్చయిపోతుంటుంది. అందుకే రాబోయే 2,3 నెలల ఖర్చులు ముందుగానే అంచనా వేసుకోవాలి అప్పుడే బయటపడొచ్చు.

డబ్బు గురించి మీ ఆలోచన ఏంటీ అనేది తెలిపేందుకు బడ్జెట్‌ వేసుకోవడం ఒక సాధనం. దీన్ని రూపొందించడంలో పొరపాట్లు చేస్తే, ఆర్థికంగా విజయం సాధించడం కష్టమవుతుంది.

పన్నుప్రయోజనాలు అందించే పథకాలు ఇవే..

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

Eenadu.net Home