ఈ చిన్న చిన్న పనులే.. మీ ఆరోగ్యాన్ని నిలబెడతాయి!
కొన్ని పనులు చేయడానికి చిన్నగా అనిపించినా వాటిని అలవాటుగా మార్చుకుంటే చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
Image:Eenadu
ఈ రోజుల్లో ఇంటికి దగ్గర్లో ఉండే షాపు, మార్కెట్‌కి కూడా ద్విచక్రవాహనంపైనే వెళుతున్నారు. అలా కాకుండా నడకకు ప్రాధాన్యం ఇస్తే ఇంధనం ఆదా అవ్వడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.
Image:Eenadu
ఆఫీసులో పైఅంతస్తులకు వెళ్లడానికి లిఫ్ట్ ఉపయోగించకుండా మెట్ల మార్గాన్ని ఎంచుకుంటే వ్యాయామం చేసినంత ఫలితం దక్కుతుంది.
Image:Eenadu
ఎంత ముఖ్యమైన పని ఉన్నా ఒకేచోట గంటలకొద్దీ కూర్చోవద్దు. ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే కనీసం రెండు గంటలకోసారైనా లేచి కాసేపు నడవాలి. శరీరాన్ని కాస్త అటు ఇటూ వంచాలి.
Image:Eenadu
రోజూ కాసేపైనా శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల విటమిన్ డి లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. లేదంటే ఎముకలు బలహీనపడే అవకాశముంది.
Image:Eenadu
వాకింగ్, జాగింగ్, సైక్లింగ్... ఈ మూడింట్లో దేన్నయినా ఎంచుకోండి. దానికి కనీసం 30 నిమిషాల సమయాన్ని కేటాయించండి. క్రమంగా మీ ఫిట్‌నెస్‌లో వచ్చే మార్పులు మీకే తెలుస్తాయి.
Image:Eenadu
మనిషి ప్రశాంతంగా గడపడానికి కాసేపు ఒంటరిగా ఉండాలనుకోవడం తప్పు కాదు. కానీ, రోజంతా ఏకాంతంగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి, భావోద్వేగాలపరంగా చికాకులూ ఏర్పడతాయి. కాబట్టి.. వీలైనంత వరకు నలుగురితో కలిసి ఉండాలి.
Image:Eenadu
మనిషికి నిద్ర ప్రధానమైనది. చక్కగా నిద్రిస్తేనే మరుసటి రోజు శరీరం ఉత్తేజితమవుతుంది. రోజూ కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర తప్పనిసరి.
Image:Eenadu
ఎన్ని పనులున్నా ఉదయం పూట మంచి అల్పాహారం మానొద్దు. వ్యాయామాలు సునాయాసంగా చేయాలన్నా, రోజంతా చురుగ్గా ఉండాలన్నా శక్తివంతమైన అల్పాహారం తీసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.
Image:Eenadu
ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక నిర్దిష్ట సమయాన్ని ఎంచుకుని భోజనం చేయాలి. తద్వారా జీవక్రియలు సరిగ్గా జరిగి ఆరోగ్యంగా ఉండొచ్చు.
Image:Eenadu