‘లైగర్‌’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు!

విజయ్‌ దేవరకొండ - పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్‌ ‘లైగర్‌’. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

Image:SocialMedia

‘లైగర్‌’లో విజయ్‌ దేవరకొండ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎంఎంఏ) ఫైటర్‌గా కనిపిస్తాడు. బ్రూస్లీ, మహమ్మద్‌ అలీ ఈ క్రీడలో రాణించినవారే.

Image:SocialMedia

హీరోయిన్‌గా మొదట జాన్వీ కపూర్‌ను అనుకున్నారట. డేట్స్‌ సర్దుబాటుకాకపోవడంతో అనన్య పాండేను ఎంపిక చేశారు.

Image:SocialMedia

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య. చుంకీ పాండే కూడా ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు.

Image:SocialMedia

తెలుగు, హిందీ భాషల్లో చిత్రీకరణ జరిగింది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో డబ్‌ చేసి పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.

Image:SocialMedia

ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనలాంటి వ్యక్తిని తీసుకోవాలని భావించిన చిత్రబృందం.. చివరకు ఆయన్నే ఎంపిక చేసుకుంది. టైసన్‌ను ఒప్పించడానికి ఏడాది పట్టిందట.

Image:SocialMedia

టైసన్‌ కాలు సైజు దాదాపు 20 ఉంటుందట. ఆయన కోసం ప్రత్యేకంగా షూస్‌ తయారు చేయించినట్లు దర్శకుడు పూరీ చెప్పారు.

Image:SocialMedia

ఈ చిత్రాన్ని రూ.100 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందించారు. మొదట తెలుగు చిత్రంగానే చిత్రీకరణ ప్రారంభించారు. మధ్యలో దీన్ని పాన్‌ ఇండియాగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు.

Image:SocialMedia

చిత్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్‌ జోహర్‌.. గతంలో ఓ రీమేక్‌ చిత్రంతో విజయ్‌ బాలీవుడ్‌ ఎంట్రీకి ప్లాన్‌ చేశారు. కానీ, అది కుదరలేదు. ఇప్పుడు ‘లైగర్‌’తో విజయ్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు.

Image:SocialMedia

లైగర్‌కు బాలీవుడ్‌ సంగీత దర్శకులు సునీల్‌ కశ్యప్‌, తనిష్క్‌ భగ్చి తదితరులు బాణీలు సమకూర్చారు.

Image:SocialMedia

ఎంఎంఏ ఫైటర్‌లా కనిపించడం కోసం విజయ్‌ దేవరకొండ థాయ్‌లాండ్‌ వెళ్లి శిక్షణ తీసుకున్నాడు.

Image:SocialMedia

చిత్ర ప్రచారంలో భాగంగా పూల బొకేను అడ్డం పెట్టుకుని విజయ్‌ దేవరకొండ దిగిన స్టిల్‌ వైరల్‌ అయింది.

Image:SocialMedia

విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ హిందీలో డబ్‌ అయ్యింది. సినిమా ఫలితం ఇబ్బంది పెట్టినా.. విజయ్‌కి క్రేజ్‌ వచ్చింది. అందుకే ‘లైగర్‌’ దగ్గరికొచ్చేసరికి బాలీవుడ్‌లో విజయ్‌కి మంచి ఊపు కనిపిస్తోంది.

Image:SocialMedia

‘లైగర్‌’ అడ్వాన్స్‌ బుకింగ్‌ మొదలైన తొలి రోజే దాదాపు రూ. 4 కోట్ల వసూళ్లు చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.

Image:SocialMedia

ఇక ‘లైగర్‌’ పదానికి అర్థమేంటంటే.. పాంథేరా లియో జాతికి చెందిన మగ సింహానికి, పాంథేరా లియో జాతికి చెందిన ఆడ పులికి జన్మించిన హైబ్రీడ్‌ జంతువు.

Image:SocialMedia

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home