శీతాకాలం.. పెదాలు పదిలం!

చలికాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. ముఖ్యంగా పెదవులపై పగుళ్లు ఏర్పడతాయి. మరి అధరాల ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.

image:pixabay

చలికాలం ఎక్కువగా నీళ్లు తాగరు. దీంతో శరీరంలో నీటిశాతం తగ్గి పెదవులు నిర్జీవమవుతాయి. అందుకే నీరు ఎక్కువ తాగాలి.  

image:pixabay

పెదాల ఆరోగ్యం కోసం విటమిన్‌-ఇ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

image:pixabay

పెదాలు పొడిబారకుండా తరచూ లిప్‌బామ్‌ రాసుకోవాలి. కొన్ని లిప్‌బామ్‌లు వాడితే మంట, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల లిప్‌బామ్‌లలో నాణ్యమైనవి ఎంచుకోవాలి. హెర్బల్ లిప్‌బామ్‌లను ఎంచుకుంటే మంచిది.

image:pixabay

బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగటం వల్ల పెదవులు పొడిబారకుండా ఉంటాయి. చర్మం కూడా కాంతిమంతంగా మారుతుంది. 

image:pixabay

రాత్రి పడుకునే ముందు.. పాల మీగడను పెదాలకు రాసుకుంటే మృదువుగా ఉంటాయి.

image:pixabay

తేనె, నెయ్యి కూడా పెదాలను పొడిబారకుండా కాపాడతాయి. ఇవి ఇంట్లో అందుబాటులో లేకుంటే కొబ్బరి నూనెను కూడా రాసుకోవచ్చు. మంచి ఫలితం ఉంటుంది. 

image:pixabay

పెదాలకు పెట్టుకున్న లిప్‌స్టిక్‌ను పడుకునే ముందు తుడిచేయాలి. లేదంటే పెదాలు మరింత నిర్జీవమవుతాయి.

image:pixabay

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home