అలా.. పేరు మారింది

#Eenadu

ఆకాశ్‌ పూరి.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కుమారుడు. బాలనటుడిగా అలరించి.. హీరోగా రాణిస్తున్నారు. తాజాగా తన పేరును ఆకాశ్‌ జగన్నాథ్‌గా మార్చుకున్నట్లు తెలిపారు. పేరు మార్పునకు కారణమేంటో చెప్పలేదు.

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ అదే పేరుతో ఇన్నాళ్లు వెండితెరపై అలరించాడు.. ఇటీవల తన పేరును సాయి దుర్గా తేజ్‌గా మార్చుకున్నాడు. తన తల్లి ఎప్పుడూ తనతోనే ఉన్నట్టుంటుందనే ఉద్దేశంతో ‘దుర్గ’ జతచేశారు

సంయుక్త మేనన్‌.. సార్‌, విరుపాక్ష, డెవిల్‌ చిత్రాలతో ఆకట్టుకున్న ఈ మలయాళ బ్యూటీ.. తన పేరులో మేనన్‌ను తొలగించుకుంది. తన పేరెంట్స్‌ విడాకులు తీసుకున్నారని, తన తండ్రి ఇంటి పేరును కొనసాగించడం ఇష్టంలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు

‘ప్రేమలు’తో తెలుగులోనూ క్రేజ్‌ సంపాదించుకున్నారు మమితా బైజు. తల్లీదండ్రులు నమిత అని పేరు పెట్టగా.. బర్త్‌ సర్టిఫికెట్‌లో పొరపాటున మమిత అని నమోదు చేశారట. కొత్తగా ఉందని దాన్నే కొనసాగించారు.

థ్రిల్లర్‌ మూవీస్‌తో టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు అడివి శేష్‌. అసలు పేరు శేష సన్నీ చంద్ర కాగా.. సన్నీ లియోనీ అంటూ ఫ్రెండ్స్‌ ఆటపట్టించడంతో శేష్‌గా మారానని ఓ సందర్భంలో చెప్పారు.

మాస్‌, క్లాస్‌ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తున్న నటుడు విష్వక్‌ సేన్‌. తన తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ రెండేళ్లపాటు వాయిదాపడడంతో.. న్యూమరాలజిస్ట్‌ సలహా మేరకు దినేశ్‌ నాయుడు.. విష్వక్‌గా మారారు. 

సిరాజ్‌ ‘లైక్డ్‌’ గర్ల్‌ఫ్రెండ్‌!

అలిలా కోటలో ‘రాయల్‌’గా అదితి- సిద్ధార్థ్‌

పారితోషికంలో టాప్‌.. ఏ హీరోనో తెలుసా?

Eenadu.net Home