అందాల పోటీల్లో గెలిచి.. హీరోయిన్‌గా మారి
అందాల పోటీల్లో కిరీటం అందుకున్న ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా మారడం కొత్తేమీకాదు. ఇప్పటికే ఎంతోమంది అలా సందడి చేయగా మరికొందరు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వారెవరంటే?
గాయత్రీ భరద్వాజ్..
2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ ఇండియా కిరీటం అందుకుంది. దిల్లీకి చెందిన ఈమె హిందీ చిత్రం ‘ఇత్తు సి బాత్’తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. రవితేజ సరసన నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈ నెల 20న విడుదలకానుంది.
అనుక్రీతి వాస్..
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2018 విన్నర్. తమిళనాడుకు చెందిన ఈమె తమిళ చిత్రం ‘డీఎస్పీ’తో హీరోయిన్‌గా మారింది. ‘టైగర్ నాగేశ్వరరావు’తో సందడి చేయనుంది.
మానుషి చిల్లర్..
2017లో నిర్వహించిన పోటీల్లో ‘మిస్ ఇండియా’, ‘మిస్ వరల్డ్’గా నిలిచింది. హరియాణాకు చెందిన ఈమె ‘సమ్రాట్ పృథ్వీరాజ్’ (హిందీ)తో నటిగా మారింది. వరుణ్‌తేజతో కలిసి నటించిన ‘ఆపరేషన్ వాలంటైన్’ డిసెంబరు 8న రిలీజ్ కానుంది.
మానస వారణాసి..
ఫెమినా మిస్ ఇండియా-2020 విన్నర్. అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాతో ఈమె హీరోయిన్‌గా పరిచయంకానుంది. స్వస్థలం: హైదరాబాద్.
సిమ్రన్ శర్మ..
2017లో మిస్ రాజస్థాన్‌గా నిలిచిన ఈమె ‘మిస్టర్ ఇడియట్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. రవితేజ సోదరుడి తనయుడు హీరోగా ఈ సినిమా రూపొందుతోంది.