అబ్బో.. పెద్ద సినిమాయే..!

రెండు, రెండున్నర గంటల రన్‌టైమ్‌ దాటి సినిమా ఉందంటే ఆ కథలో సత్తా ఉండాలి. అలాంటివి చాలా అరుదు. త్వరలో విడుదల కానున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ అలాంటిదే. అక్టోబర్‌ 20న విడుదలయ్యే దీని నిడివి 3.02 గంటలు. ఈ నేపథ్యంలో ఎక్కువ నిడివితో తెలుగులో ఇప్పటి వరకూ ఉన్న చిత్రాలివే..!

ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌గా రాజమౌళి తీర్చిదిద్దిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. 2022లో విడుదలైన ఈ సినిమా 3.02 గంటల నిడివి ఉంటుంది.

‘అర్జున్‌ రెడ్డి’ని 182 నిమిషాల రన్‌టైమ్‌తో తీర్చిదిద్దారు. విజయ్‌ దేవరకొండ - షాలినీపాండే ప్రధాన పాత్రలు పోషించారు.

 శర్వానంద్‌ - సాయికుమార్‌ కీలకపాత్రల్లో నటించిన పొలిటికల్‌ డ్రామా ‘ప్రస్థానం’. దీని నిడివి 3.01 గంటలు.

మహేశ్‌బాబు నటించిన ‘నిజం’ రన్‌టైమ్‌ 3 గంటల 7 నిమిషాలు.

వెంకటేశ్‌ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’ చిత్రం రన్‌టైమ్‌ 3 గంటలు.

కృష్ణ టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. ఈ సినిమా నిడివి 187 నిమిషాలు.

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం పోషించిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’. 1977లో విడుదలైన ఈ సినిమా నిడివి 3 గంటల 46 నిమిషాలు.

1965లో విడుదలైన ‘పాండవ వనవాసం’ సినిమా నిడివి 3 గంటల 18 నిమిషాలు. ఎన్టీఆర్‌ - సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించారు.

ఎన్టీఆర్‌ - ఏయన్నార్‌ - సావిత్రి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మాయాబజార్‌’. దీని రన్‌టైమ్‌ 184 నిమిషాలు ఉంటుంది.

ఎన్టీఆర్‌ - అంజలి దేవి జంటగా నటించిన ‘లవకుశ’ రన్‌టైమ్‌ 208 నిమిషాలు.

ఎన్టీఆర్‌ - ఏయన్నార్‌ - సావిత్రి నటించిన ‘మిస్సమ్మ’ నిడివి 3 గంటల 1 నిమిషం ఉంటుంది.

ఎన్టీఆర్‌ కీలకపాత్ర పోషించిన ‘పాతాళ భైరవి’ చిత్రం 3.15 గంటల నిడివి ఉంటుంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home