సిల్వర్‌ స్క్రీన్‌ ‘టైగర్స్‌’

దసరా బరిలో ‘టైగర్‌ నాగేశ్వరరావు’గా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు ప్రముఖ హీరో రవితేజ. ‘దొంగాట’ ఫేం వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా.. ఇంతకుముందు టైగర్‌/పులి/బెబ్బులి పేరుతో వచ్చిన సినిమాలు గుర్తు చేసుకుందామా..

టైగర్‌..

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా రూపొందిన సినిమా (2015) ఇది. వి.ఐ. ఆనంద్‌ డైరెక్షన్‌లో తెరకెక్కింది. 

బెంగాల్‌ టైగర్‌..

రవితేజ హీరోగా దర్శకుడు సంపత్‌ నంది తెరకెక్కించిన చిత్రమిది (2015). 

టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌..

హీరో: నందమూరి హరికృష్ణ; డైరెక్టర్‌: వి. సముద్ర. 2003లో విడుదలైంది.

కొమరం పులి..

పవన్‌ కల్యాణ్‌ హీరోగా ఎస్‌.జె. సూర్య తెరకెక్కించిన చిత్రమిది (2010).

పులి..

హీరో: విజయ్‌; దర్శకుడు: చింబు దేవన్‌; విడుదల: 2015.

టైగర్‌ 3..

బాలీవుడ్‌లో విశేష క్రేజ్‌ ఉన్న ఫ్రాంచైజీల్లో ఇదొకటి.ఇ ‘ఏక్‌థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ తర్వాత రూపొందిన ‘టైగర్‌ 3’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

టైగర్‌ రాముడు..

సి.ఎస్‌. రావు దర్శకత్వంలో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా 1962లో విడుదలైంది.

టైగర్‌..

ఎన్టీఆర్‌ హీరోగా నందమూరి రమేశ్‌ తెరకెక్కించిన చిత్రమిది (1979). ఇందులో రజనీకాంత్‌ కీలక పాత్ర పోషించారు.

బొబ్బిలి పులి..

దర్శకుడు దాసరి నారాయణరావు- నటుడు ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా (1982) ఇది.

బెబ్బులి..

కృష్ణంరాజు హీరోగా తెరకెక్కింది (1980). దర్శకుడు: వి. మధుసూదనరావు.

పులిబిడ్డ..

కృష్ణంరాజు- మధుసూదనరావు కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా 1981లో విడుదలైంది.

బెజవాడ బెబ్బులి..

కృష్ణ కథానాయకుడిగా విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది (1983).

పల్నాటిపులి..

బాలకృష్ణ హీరోగా దర్శకుడు తాతినేని ప్రసాద్‌ తెరకెక్కించిన చిత్రమిది (1984).

బ్లాక్‌ టైగర్‌..

రమేశ్‌ బాబు హీరోగా దాసరి నారాయణరావు రూపొందించిన సినిమా ఇది.

పులి బెబ్బులి..

కృష్ణంరాజు, చిరంజీవి కలిసి నటించిన ఈ చిత్రాన్ని కె.ఎస్‌.ఆర్‌. దాస్‌ తెరకెక్కించారు.

వింటర్‌ ట్రెండ్స్‌ చూశారా..?

ఏ ట్రైలర్‌ని ఎంత మంది చూశారో..?

తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

Eenadu.net Home