దేశంలో ఎన్ని జాతీయ పార్టీలున్నాయో తెలుసా?
తాజాగా తెలంగాణలోని స్థానిక పార్టీ(తెలంగాణ రాష్ట్ర సమితి)ని జాతీయ పార్టీ(భారత్ రాష్ట్ర సమితి)గా మార్చారు. మరి ఇప్పటి వరకు దేశంలో ఎన్నికల కమిషన్ గుర్తింపు ఉన్న జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయో తెలుసా?
భారతీయ జనతా పార్టీ
ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్‌లో 303 లోక్‌సభ స్థానాలు, 92 రాజ్యసభ స్థానాలు భాజపావే.
#Eenadu
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. ఈ పార్టీకి లోక్‌సభలో 53, రాజ్యసభలో 31 ఎంపీలున్నారు.
#Eenadu
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
పార్టీ చైర్‌పర్సన్ మమతా బెనర్జీనే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ పార్టీ గెలుచుకున్న ఎంపీల్లో 23 మంది లోక్‌సభ, 13 రాజ్యసభ సభ్యులున్నారు.
#Eenadu
బహుజన్ సమాజ్ పార్టీ
అధ్యక్షురాలిగా మాయావతి కొనసాగుతున్నారు. ఈ పార్టీకి పార్లమెంట్‌లో 10 మంది లోక్‌సభ ఎంపీలు.. ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు.
#Eenadu
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నది సీనియర్ నాయకుడు శరద్ పవార్. ఈ పార్టీకి చెందిన ఎంపీలు లోక్‌సభలో ఐదుగురు, రాజ్యసభలో నలుగురు ఉన్నారు.
#Eenadu
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్టు)
ఈ పార్టీ జనరల్ సెక్రటరీ.. సీతారామ్ ఏచూరి. లోక్‌సభలో 3 ఎంపీలు, రాజ్యసభలో ఐదుగురు ఎంపీలున్నారు.
#Eenadu
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
వామపక్ష పార్టీ సీపీఐకి జనరల్ సెక్రటరీగా డి.రాజా వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభలో రెండు చొప్పున ఎంపీ సీట్లు ఉన్నాయి.
#Eenadu
నేషనల్ పీపుల్స్ పార్టీ
దీని అధ్యక్షుడు కన్‌రాడ్ సంగ్మా. ఈ పార్టీ పార్లమెంట్ ఉభయ సభల్లో ఒక్కో సీటు దక్కించుకుంది.
#Eenadu