ఏడాది పొడవునా వికసించే పూలు ఇవీ..!
మందారం
చాలా మంది ఇంటి పెరట్లో పెంచుకునే పూల చెట్టు ఇది. నిత్యం ఈ చెట్టుకు పూలు పూస్తూనే ఉంటాయి. వీటితో నూనె తయారు చేసి తలకు రాసుకుంటే.. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
Image: Pixabay
గులాబీ
గులాబీ చెట్లను పెంచుకోవడం చాలా సులభం. రోజూ నీరు పోస్తే చాలు.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పూలు పూస్తాయి. రంగురంగుల గులాబీలను ఇంట్లో పెంచుకుంటే ఎంత బాగుంటుందో...!
Image: Pixabay
బిళ్ల గన్నేరు(పెరివింకిల్)
పల్లెటూర్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని పెంచితే.. పెరటికి, బాల్కనీకి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి.
Image: Pixabay
మల్లెపూలు
ఏడాది పొడవునా పూసే పువ్వుల్లో మల్లెలు కూడా ఉన్నాయి. ఏ రోజుకు ఆరోజు ఈ పూలు దేవుడి కోసం లేదా మహిళల కోసం మాలగా మారిపోతుంటాయి.
Image: Pixabay
పీస్ లిల్లీ
తెలుపు రంగులో ఆకట్టుకునే ఆకృతిలో ఉండే పీస్ లిల్లీ పూల మొక్కలు ఇంట్లో పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. సరైన వాతావరణంలో పెంచగలిగితే.. ఏడాది పొడవునా పూలు పూస్తాయి.
Image: Pixabay
కాగితం పూలు (బౌగెన్‌విల్లే)
కాగితంతో తయారు చేసినట్లుగా ఉండే ఈ రంగురంగుల పూలు.. భలే ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంట్లోనే కాదు.. పెరట్లో, వీధుల్లో ఎక్కడ నాటినా ఈ మొక్కలు గుబురుగా పెరుగుతాయి.
Image: Pixabay
తలంబ్రాల పూలు (లాంటానా)
ఒకే కొమ్మకు రంగురంగుల్లో పూసే ఈ పూలు చూడగానే ఆకట్టుకుంటాయి. 55 ఫారీన్‌హీట్స్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో ఏడాదంతా పూలు వికసిస్తూనే ఉంటాయి.
Image: Pixabay
అల్లెనందా (గోల్డెన్ ట్రంపెట్)
మీటరు ఎత్తు పెరిగే ఈ మొక్క ఎప్పుడూ వికసించిన పూలతో నిండుగా కనిపిస్తుంటుంది. పసుపు రంగులో ఉండే ఈ పూలు.. మంచి సువాసనను కూడా వెదజల్లుతాయి. ఇంట్లో లేదా పెరట్లో పెంచుకోవచ్చు.
Image: Pixabay
నూరు వరహాల పువ్వు/వెన్నముద్దపూలు (ఇక్సోరా)
ఒక్కో కొమ్మ చివర్లో పూలన్నీ ముద్దగా వికసిస్తాయి. అందుకే.. వీటిని నూరు వరహాల/వెన్నెముద్ద పూలని పిలుస్తుంటారు. ఇవి కూడా ఏడాది పొడవునా పూస్తాయి. గార్డెన్‌లో పెంచుకుంటే.. కనువిందుగా ఉంటుంది.
Image: Pixabay