అమ్మో.. ఇంత నిడివా!

యానిమల్‌...

డిసెంబరు 1న విడుదలకానున్న ‘యానిమల్‌’ (రణ్‌బీర్‌కపూర్‌, రష్మిక జంటగా నటించారు) రన్‌టైమ్‌ 3:21 గంటలు. దాంతో, ‘అమ్మో.. ఇంత నిడివా!’ అంటూ చర్చ జరుగుతోంది. గతంలోనూ కొన్ని చిత్రాల విషయంలో ఇదే అనుకున్నారు. అవేంటో చూసేయండి..

ఆదిపురుష్‌

ప్రభాస్‌ హీరోగా రూపొందిన ఈ సినిమా నిడివి 2:59 గంటలు. ఈ ఏడాది జూన్‌లో విడుదలైంది.

ఆర్‌ఆర్‌ఆర్‌..

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిడివి 3:02 గంటలు. 2022లో విడుదలైంది.

పుష్ప: ది రైజ్‌

ఈ సినిమా నిడివి 2:59 గంటలు. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ సినిమా 2021లో విడుదలైంది. 

అర్జున్‌రెడ్డి

‘అర్జున్‌రెడ్డి’ని 3:02 గంటల నిడివితో తీర్చిదిద్దారు. విజయ్‌ దేవరకొండ హీరో. 2017లో విడుదలైంది.

ఎం.ఎస్‌.ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ

2016లో విడుదలైన ఈ సినిమా రన్‌టైమ్‌ 3:05 గంటలు. సుశాంత్‌ సింగ్‌రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రధారి.

ప్రస్థానం..

శర్వానంద్‌, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో రూపొందింది. 2010లో విడుదలైన ఈ సినిమా రన్‌టైమ్‌ 3:01 గంటలు.

నువ్వు నాకు నచ్చావ్‌..

వెంకటేశ్‌ ప్రధాన పాత్ర పోషించారు. 2001లో విడుదలైన ఈ సినిమా నిడివి 3 గంటలు.

శివాజీ..

రజనీకాంత్‌ హీరోగా రూపొందిన సినిమా ఇది. 2007లో విడుదలైన ఈ మూవీ రన్‌టైమ్‌ 3:05 గంటలు.

అల్లూరి సీతారామరాజు

కృష్ణ ప్రధాన పాత్రధారి. 1974లో విడుదలైంది. రన్‌టైమ్‌ 3:07 గంటలు.

అపరిచితుడు..

విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రన్‌టైమ్‌ 3:01 గంటలు. 2005లో విడుదలైంది.

లగాన్‌.. 

ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నిడివి 3: 44 గంటలు. 2001లో విడుదలైంది.

గజిని..

3:05 గంటల నిడివితో ఈ సినిమా రూపొందింది. సూర్య హీరోగా 2005లో విడుదలైంది. 

దాన వీరశూరకర్ణ..

ఎన్టీఆర్‌ నటించిన ఈ సినిమా 1977లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిడివి: 3: 46 గంటలు. 

7జీ బృందావన కాలనీ..

ఈ సినిమా రన్‌టైమ్‌ 3:05 గంటలు. రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ జంటగా నటించారు. 2004లో విడుదల.

నిజం..

మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నిడివి 3:07 గంటలు. 2003లో విడుదలైంది. 

#eenadu

అగ్ర హీరోలతో దుషారా

ధనుష్‌.. ఓ ఇన్‌స్పిరేషన్‌

శ్రుతి హాసన్ @ 15.. ఈ విషయాలు తెలుసా?

Eenadu.net Home