#Eenadu

వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో విఘ్నేశ్వరుడు 70 అడుగుల ఎత్తులో కొలువుదీరాడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి వినాయకుడిని దర్శించుకుని తొలి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ తీరంలో 20 రకాల పండ్లతో తీర్చిదిద్దిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది.

విజయనగరం రైల్వే స్టేషన్ రోడ్డులో మత్స్య అవతారంలో దర్శనమిస్తున్న గణనాథుడు

పార్వతీపురం మన్యం జిల్లాలో కొలువుదీరిన బొజ్జగణపయ్య

నెల్లూరులో తొలిసారిగా బెజవాడ గోపాల్‌ రెడ్డి సెంటర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు

విశాఖ జిల్లాలోని సింధియా -గాజువాక డిపో వద్ద ఏర్పాటు చేసిన బెల్లం వినాయకుడి విగ్రహం

గంజాం జిల్లాలో గుంథోబొందొ గ్రామానికి చెందిన ఆంచలిక వికాస్ పరిషత్‌ ఆధ్వర్యంలో వినాయక చవితి పూజలను ప్రకృతి ఒడిలో నిర్వహించారు. వేప చెట్టుకు విఘ్నేశ్వరుడి రూపాన్ని అలంకరించారు.

శ్రీకాకుళం జిల్లా బొరివంకలో మజ్జి బొనమాలి ఇంటి వద్ద తోటలో కర్ర పెండలం దుంపలో కనిపించిన వినాయకుడి ఆకారం

శ్రీకాకుళం జిల్లా బొరివంక పెద్ద ఒరియా వీధిలో ఆవాలతో తయారుచేసిన అయోధ్య బాల రామ గణపతి

చిత్రం చెప్పే విశేషాలు

ఇతరులకు భిన్నంగా నిలబెట్టేవి ఏంటో తెలుసా?

చిత్రం చెప్పే విశేషాలు

Eenadu.net Home