తారలు..

ప్రేమలో పడ్డారు.. పెళ్లిపీటలెక్కారు!

చిత్రసీమలో కొంతమంది తారలు ప్రేమలో మునిగి.. వివాహబంధంతో ఒక్కటయ్యారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ మధ్యకాలంలో పెళ్లిపీటలెక్కిన కొన్ని ప్రేమజంటలపై లుక్కేద్దామా..

కీర్తి సురేష్‌, ఆంటోనీ తట్టిల్‌ల ప్రేమ కథ దాదాపు 15 ఏళ్ల కిందటే మొదలైందట. గతేడాది డిసెంబర్‌ 12న వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

మూడేళ్ల నుంచి శోభితా ధూళిపాళ, నాగచైతన్య ప్రేమలో ఉన్నారు. వీరి పెళ్లి గతేడాది డిసెంబర్‌ 4న కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది.

అదితీరావు హైదరీ- సిద్ధార్థ్‌ కొంతకాలంగా ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో 2024 సెప్టెంబరు 16న వివాహం చేసుకున్నారు. 

2019లో ‘రాజావారు రాణిగారు’ షూటింగ్‌ సమయంలో కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ ప్రేమలో పడ్డారు. 2024 ఆగస్టు 22న పెళ్లిపీటలెక్కారు. 

పెళ్లికి ముందు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నారు సోనాక్షి సిన్హా, జహీర్‌ ఇక్బాల్‌. వీరిద్దరు గతేడాది జూన్‌ 23న పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

నాలుగేళ్ల క్రితమే బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది రకుల్‌ ప్రీత్‌. 2024 ఫిబ్రవరి 21న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌, వ్యాపారవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ గత 14 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. 2024 మార్చి 1న పెళ్లి చేసుకున్నారు.

కొన్నేళ్లపాటు ప్రేమ బంధంలో ఉన్న మెగా హీరో వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి 2023 నవంబర్ 1న పెళ్లి చేసుకున్నారు.

స్నేహితుడు జగత్‌ దేశాయ్‌ ప్రపోజ్‌ చేయగా దానికి అంగీకరించింది అమలా పాల్‌. దీంతో ఈ జంట 2023 అక్టోబర్‌ 26న పెళ్లి పీటలెక్కింది.

కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న కియారా అడ్వాణీ , సిద్ధార్థ్‌ మల్హోత్ర 2023 ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నారు.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home