12 ఏళ్లకే సినిమాల్లోకి.. ఇప్పుడు కుర్రాళ్ల కలల్లోకి..

‘లవ్‌టుడే’తో కుర్రకారు కలల రాణిగా మారిపోయింది ఇవానా. ఇప్పుడు ‘సెల్ఫిష్‌’ అంటూ మరో సినిమాతో రావడానికి సిద్ధమైంది. 

‘రౌడీ బాయ్స్‌’ ఫేమ్‌ ఆశిష్‌ రెడ్డి హీరోగా కాశీ విశాల్‌ తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాను జులై 31న విడుదల చేయనున్నారు. 

ఇవానా 2012లో మలయాళంలో ‘మాస్టర్స్‌’తో బాలనటిగా కెరీర్‌ మొదలుపెట్టింది. ఆ తర్వాత కొన్ని మలయాళ, తమిళ చిత్రాల్లో బాలనటిగా, సహాయ పాత్రల్లో కనిపించింది. 

‘లవ్‌టుడే’లో తన సహజ నటనతో ఇటు విమర్శకుల ప్రశంసలు, అటు యూత్‌ మనసు గెలుచుకుంది. 

‘అనురాగ్‌ కరిక్కిన్ వేలం’, ‘రాణి పద్మిని’, ‘నాచియార్‌’, ‘హీరో’, ‘మతిమారన్‌’, ‘కల్వన్‌’, ‘ఎల్‌జీఎమ్‌’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇవానా అసలు పేరు ఎలీనా షాజి. ‘నాచియార్‌’ తర్వాత పేరు మార్చుకుంది. 2000లో కేరళలో పుట్టి.. అక్కడే కేరళ యూనివర్శిటీలో బీకామ్‌ చేసింది.

నటన మీద ఆసక్తితో 12 ఏళ్ల వయసులోనే బాలనటిగా సినిమాల్లోకి వచ్చేసింది. అయితే చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. 

This browser does not support the video element.

ఇక ఇవానాకు సోషల్‌ మీడియాలో క్రేజ్‌ మామూలుగా ఉండదు. తరచూ డిఫరెంట్‌ ఫొటోషూట్లతో సందడి చేస్తూ ఉంటుంది.

ఇన్‌స్టాలో ఇవానాకు 21 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. 

వర్షంలో ఆడుకుంటూ, చెట్ల మధ్య తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించడమంటే ఈమెకి ఇష్టం.

‘ఒత్తిడిని జయించాలంటే స్నేహితులతో కేరింతలు కొట్టాల్సిందే.. నాకు ఓ ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ ఉంది మీకూ ఉందా..’ అంటూ స్నేహితులతో ఎంజాయ్‌ చేసిన ఫొటోలు పంచుకుంటూ సరదాగా క్యాప్షన్‌లు జోడిస్తుంది.

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ

గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

Eenadu.net Home