ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్స్ ఇవీ...!
49 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్ 2017: కోల్‌కతా 131 పరుగులకు ఆలౌట్ కాగా.. లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు 49 పరుగులకు కుప్పకూలింది.
#Eenadu
58 - రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2009: తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 58 పరుగులకు ఆలౌటైంది.
#Eenadu
59 - రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2023: బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ చతికిలపడి 59 పరుగులకే చేతులెత్తేసింది.
#Eenadu
66 - దిల్లీ డేర్‌డెవిల్స్
ఐపీఎల్ 2017: ముంబయి తొలుత 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. దిల్లీ 66 పరుగులకే ఆలౌటై ఓటమి మూటగట్టుకుంది.
#Eenadu
67 - దిల్లీ డేర్‌డెవిల్స్
ఐపీఎల్ 2017: దిల్లీ మొదట బ్యాటింగ్ చేసి 67 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
#Eenadu
67 - కోల్‌కతా నైట్‌రైడర్స్
ఐపీఎల్ 2008: కోల్‌కతా తొలుత బ్యాటింగ్‌కు దిగి 67 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబయి కేవలం 6 ఓవర్లలోపే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
#Eenadu
68 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్ 2022: హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బెంగళూరు బ్యాటింగ్ చేసి 68 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
#Eenadu
70 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్ 2019: బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి 70 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
#Eenadu
70 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఐపీఎల్ 2014: బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి 70 పరుగులకు కుప్పకూలగా.. రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
#Eenadu
73 - కింగ్స్ XI పంజాబ్
ఐపీఎల్ 2017: పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసి 73 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
#Eenadu