‘మ్యాడ్‌’ భామ

‘8 వసంతాలు’

‘మ్యాడ్‌’లో ‘జెన్నీ’ పాత్రలో నార్నే నితిన్‌కు జంటగా నటించిన అనంతిక సనిల్‌కుమార్‌ ఇప్పుడు ‘8 వసంతాలు’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అనంతిక కీలక పాత్ర పోషిస్తోంది. ‘8 వసంతాలు’ ట్రైలర్‌ తాజాగా విడుదలయ్యింది.

2000లో కేరళలోని త్రిస్సూర్‌లో పుట్టింది. అయిదేళ్ల వయసులోనే సంప్రదాయ నృత్యంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది.

కథాకళి, భరతనాట్యం, మోహినీయాట్టం, కూచిపూడిలో శిక్షణ తీసుకుంటూనే అనేక స్టేజీ ప్రదర్శనలు ఇచ్చింది.

కరాటేలో బ్లాక్ బెల్ట్‌ అందుకుంది. కేరళ మార్షల్‌ ఆర్ట్‌ కలరియపట్టులో ప్రావీణ్యం సాధించింది. 

2020లో హెరాల్డ్‌ మ్యాగజైన్‌ కొచ్చి యంగ్‌లీడర్స్‌ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది అనంతిక.

నృత్య ప్రదర్శనలతోనే 2022లో తొలి సినిమా ‘రాజమండ్రి రోజ్‌ మిల్క్‌’లో అవకాశం అందుకుంది.

‘రైడ్‌’(2023), ‘లాల్‌ సలామ్‌’(2024) వంటి చిత్రాలతో తమిళంలో అలరించింది. 2023లో వచ్చిన ‘మ్యాడ్‌’ మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. ఆలయాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుంది.

కేరళ సంప్రదాయ సంగీతంలో ఉపయోగించే డప్పు చెండాను వాయించడం నేర్చుకుంది. 

చీరలు, కొలనులో కలువలు ఈమె ఫేవరెట్‌. వాటిని చూస్తే ఫొటోలు తీయకుండా/దిగకుండా ఉండలేదు.

ఓల్డ్‌ + న్యూ= కొత్త రెట్రో

ముక్కు పుడక.. మస్తుంది మేడం!

బరువు సంగతి.. జిమ్‌లో చూసుకుందాంలే!

Eenadu.net Home