‘కనుసైగలతోనే వలచింది..’ ఈమెనే!

This browser does not support the video element.

‘కను సైగలతోనే వలచితిని..’ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న పాట. ఇందులో ‘చిట్టెమ్మ’గా ఆడిపాడింది మధు నాయుడు.

రోల్‌రైడా ర్యాప్‌ చేసిన పాటకు మధునాయుడు డ్యాన్స్‌తో సోషల్‌ మీడియా షేక్‌ అవుతుంది.

మధు పుట్టింది రాజమహేంద్ర వరం, పెరిగింది హైదరాబాద్‌. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టింది.

2022లో యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం 3లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

2024లో వచ్చిన ‘24 అవర్స్‌ రొమాన్స్‌’ యూట్యూబ్‌ సిరీస్‌ రెండు సీజన్లతో మంచి పేరు సంపాదించుకుంది. 

2022లో ‘బేబమ్మ’ వెబ్‌సిరీస్‌ ద్వారా మొదటిసారి ఓటీటీలోకి వచ్చింది. 

ప్రైవేట్‌ ఆల్బమ్స్‌లో ఆడి పాడుతూ, ఇన్‌స్టాలో రీల్స్‌ పోస్టు చేస్తుంది. ఈమె ఇన్‌స్టా ఖాతాకి 6లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

‘ఖాళీగా ఉన్నా, బాధలో ఉన్నా.. కిచెన్‌, బెడ్‌రూమ్‌ అని తేడా లేకుండా ఇల్లంతా సర్దేస్తాను. అప్పుడు నా మూడ్‌ సెట్‌ అవుతుంది’ అంటోంది.

‘నాకు మ్యూజిక్‌ అంటే పిచ్చి. ఏ మూడ్‌లో ఉంటే ఆ మూడ్‌కి తగ్గట్టు పాటలను వింటాను’ అని చెప్పింది.

వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాల్లో డ్యాన్స్‌ చేస్తుంది. ‘బాలయ్య హిట్‌ పాటలకు డ్యాన్స్‌ చేస్తే ఆ కిక్కే వేరు’ అంటోంది.

రాత్రిళ్లు ఛార్మినార్‌ సందుల్లో తిరుగుతూ షాపింగ్‌ చేయడం ఈమె హాబీ..

మోడలింగ్‌ కోసం డిగ్రీ వదిలేశా

‘దిల్‌రూబా’తో సందడి చేయనున్న రుక్సార్‌

కన్నప్ప లుక్స్‌ చూశారా..!

Eenadu.net Home