హిస్టరీ రిపీట్‌.. మహేశ్‌కు కలిసొచ్చిన సంక్రాంతి

#Eenadu

టక్కరి దొంగ


మహేశ్‌బాబు హీరో అయ్యాక సంక్రాంతికి వచ్చిన మొదటి సినిమా. లిసా రే, బిపాసబసు కథానాయికలు. జయంత్‌ సి.పరాన్జీ దర్శకుడు. కౌబాయ్‌గా మహేశ్‌ అలరించారు.

ఒక్కడు


ఇండస్ట్రీ హిట్‌. గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో భూమిక కథానాయిక. ప్రకాశ్‌రాజ్‌ ప్రతినాయకుడు. మణిశర్మ మ్యూజిక్‌ సినిమాకి హైలైట్‌. 

బిజినెస్‌మేన్‌


పూరి జగన్నాథ్‌ -మహేశ్‌ బాబు కాంబోలో వచ్చిన ఈ మూవీ మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. ముంబయి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కాజల్‌ కథానాయిక.

సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు


వెంకటేశ్‌తో కలిసి మహేశ్‌ నటించిన మల్టీస్టారర్‌. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. క్లాసిక్‌ హిట్‌ అందుకుంది. ఇందులో మహేశ్‌కు జోడీగా సమంత నటించింది. 

1 నేనొక్కడినే


అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినా, విమర్శకుల నుంచి ప్రశంసలు పొంది, కల్ట్‌ థ్రిల్లర్‌గా నిలిచింది. సుకుమార్‌ దర్శకుడు. కృతి సనన్‌ కథానాయికగా నటించింది.

సరిలేరు నీకెవ్వరు


మహేశ్‌బాబు కెరీర్‌లో సూపర్‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న సినిమాల్లో ఇదీ ఒకటి. రష్మిక కథానాయిక. అనిల్‌ రావిపూడి దర్శకుడు.

గుంటూరు కారం


‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. 

ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

క్యాడ్‌బరీ బ్యూటీ.. మూడు సినిమాలతో బిజీ..

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

Eenadu.net Home