చర్మం దెబ్బతినడానికి ముఖ్య కారణాలివీ..!

ఎండలో ఎక్కువగా నిల్చోవడం..

చాలా మంది విటమిన్‌ డి కోసం ఎండలో నిల్చుంటారు. కానీ, అతిగా నిల్చుంటే సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి. ముసలితనం తొందరగా వచ్చేలా ప్రేరేపిస్తాయి. 

Image: RKC

నిద్రను నిర్లక్ష్యం చేయడం..

అర్ధరాత్రి దాటినా మేల్కొనే ఉండటం.. సరిగా నిద్రపోకపోవడం వల్ల శారీరకంగా.. మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. చర్మం కళ తప్పి తొందరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి. అందుకే, రోజుకు 7-8గంటలు నిద్రించాలి.

Image: RKC

మాయిశ్చరైజర్‌ వాడకపోవడం..

స్నానం చేయగానే సరిపోదు.. ఆ తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. అప్పుడే చర్మం తేమతో.. మృదువుగా ఉంటుంది. లేదంటే చర్మంపై తొందరగా ముడతలు వచ్చేస్తాయి.

Image: RKC

వ్యాయామం చేయకపోవడం..

వ్యాయామం లేకపోతే శరీరంలో కొవ్వు పెరిగి ఊబకాయానికి దారి తీస్తుంది. వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అలా కాకూడదంటే. రోజూ కనీసం అరగంటయినా వ్యాయామం చేయాలి.

Image: RKC

ఒత్తిడికి లోనవడం..

వృత్తి, వ్యక్తిగత విషయాల్లో తలెత్తే ఒత్తిడి ప్రభావం మెదడుపైనే కాదు.. శరీరం, చర్మంపై కూడా పడుతుంది. చర్మం సహజ మెరుపును కోల్పోతుంది. దీంతో వయసైపోయిన వారిలా కనిపిస్తారు.

Image: RKC

సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం..

జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తింటే.. అది వయసు మీదపడటాన్ని మరింత వేగవంతం చేస్తుంది. చర్మంపై ముడతలు ఏర్పడి.. తొందరగా వృద్ధ్యాపం వచ్చేస్తుంది. అందుకే, పరిమితంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

Image: RKC

నీరు ఎక్కువ తాగకపోవడం..

శరీరం డీహైడ్రేట్‌ కాకూడదన్నా.. చర్మం తేమగా.. మృదువుగా ఉండాలన్నా తగినంత నీరు తాగాలి. లేదంటే చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది.

Image: RKC

కాలుష్యం..

దుమ్ముధూళీతో నిండిన కాలుష్య వాతావరణంలో ఎక్కువసేపు ఉంటే.. వాటిలోని హానికర రసాయనాలు చర్మంపై ప్రభావం చూపిస్తాయి.

Image: Unsplash

మద్యపానం..

మద్యం ఎక్కువగా తాగితే చాలా మంది లావెక్కుతారు. లివర్‌ సంబంధిత వ్యాధుల బారిన పడటమే కాదు.. చూడటానికి వయసుమళ్లిన వారిలా కనిపిస్తారు.

Image: RKC

ధూమపానం..

సిగరెట్లు తాగడం వల్ల శరీరంలోని కణాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. చర్మం బలహీనపడుతుంది.

Image: RKC

ఫొటోగ్రఫీ నిషేధించిన పర్యాటక ప్రాంతాలు..

మిస్‌ వరల్డ్‌ వైడ్‌ 2024.. #గుజరాత్‌ బ్యూటీ

నవ్వితే ఎన్ని లాభాలో..

Eenadu.net Home