క్రీడా రంగంలో మెగా టోర్నీలివే..

ఫిఫా (సాకర్) వరల్డ్ కప్‌ 


ఫుట్‌బాల్‌ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది ఫిఫా వరల్డ్‌ కప్‌. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి దీన్ని నిర్వహిస్తారు. ఖతర్‌ వేదికగా 2022 పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 32 దేశాలు పాల్గొంటాయి.

image:Twitter

ఒలింపిక్స్


క్రీడా రంగంలో ఒలింపిక్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ టోర్నీలో అనేక రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తారు. దాదాపు 200 దేశాలు ఈ పోటీల్లో పాల్గొంటాయి.

image:Twitter

UEFA ఛాంపియన్స్ లీగ్


ఈ టోర్నీని ఏటా యూనియన్‌ ఆఫ్‌ యూరోపియన్‌ ఫుట్‌బాల్ అసోసియేషన్స్‌ నిర్వహిస్తుంది. 1955-56లో మొదటి పోటీలు జరిగాయి. 55 దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటాయి.

image:Twitter

క్రికెట్‌ వరల్డ్ కప్‌ 


క్రికెట్‌లో వరల్డ్ కప్‌కు చాలా క్రేజ్‌ ఉంటుంది. వన్డే ప్రపంచకప్‌ని ప్రతి నాలుగు సంవత్సరాలకు, టీ20 ప్రపంచకప్‌ని రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. గత వన్డే ప్రపంచకప్‌(2019)లో ఇంగ్లాండ్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

image:Twitter

సూపర్‌ బౌల్‌ 


నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ విజేతను నిర్ణయించేందుకు అమెరికాలో ప్రతి ఏడాది దీన్ని నిర్వహిస్తారు. ఈ మ్యాచ్‌ చూసేందుకు వేల మంది స్టేడియానికి తరలి వస్తారు.

image:Twitter 

 వింబుల్డన్‌  


ప్రపంచంలోని గొప్ప క్రీడా ఈవెంట్లలో వింబుల్డన్ ఒకటి. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన టెన్నిస్ ఛాంపియన్‌షిప్ కూడా. 1877 నుంచి లండన్‌లోని వింబుల్డన్‌లో నిర్వహిస్తున్నారు.

image:Twitter 

టూర్ డి ఫ్రాన్స్ సైక్లింగ్


ఈ టోర్నీని ఫ్రాన్స్‌లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అప్పుడప్పుడు సమీప దేశాలకు తరలుతుంది. బహుళ దశల్లో జరిగే ఈ సైకిల్‌ రేసు 2వేల మైళ్లు కొనసాగుతుంది. ఇందులో దాదాపు 200 మంది సైక్లిస్ట్‌లు పాల్గొంటారు.

image:Twitter

రగ్భీ వరల్డ్ కప్


దీనిని రగ్భీ యూనియన్ వరల్డ్ కప్ అని కూడా అంటారు. అంతర్జాతీయ రగ్భీ బోర్డ్ ఈ టోర్నీని ప్రతి నాలుగేళ్లకోసారి నిర్వహిస్తుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటాయి.

image:Twitter

కామన్వెల్త్‌ గేమ్స్‌


ఒలింపిక్స్‌ తర్వాత మరో అతిపెద్ద టోర్నీ కామన్వెల్త్‌ గేమ్స్‌. గతంలో బ్రిటన్‌ పాలనలో ఉన్న దేశాలన్నీ ఈ పోటీల్లో పాల్గొంటాయి. నాలుగేళ్లకోసారి ఈ గేమ్స్‌ నిర్వహిస్తారు.

Image: Twitter/Commonwealth games

IPL సెంచరీలు.. భారత బ్యాటర్లు వీరే!

చాహల్ @ 200.. తర్వాత ఎవరంటే?

ఐపీఎల్‌.. ఒక్క పరుగు తేడాతో గెలిచిన జట్లు ఇవే

Eenadu.net Home