వర్షాకాలంలో మేకప్‌ ఇలా..

 ప్రైమర్‌తో..

ముందుగా ముఖానికి ప్రైమర్‌ని రాసుకోవాలి. దాని వల్ల చర్మానికి తేమ అందుతుంది. అంతేకాకుండా తర్వాత వేసుకునే మేకప్‌ కూడా చక్కగా కలుస్తుంది. వాటర్‌ప్రూఫ్‌ ప్రైమర్‌నే ఎంచుకోవాలి. 

image:unsplash

ఫౌండేషన్‌..

మేకప్‌ చెక్కు చెదరకుండా ఉండాలంటే వాటర్‌ ప్రూఫ్‌ ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. ఇది చర్మంపై నీరు పడినా మేకప్‌ పోకుండా చూస్తుంది. మన చర్మ ఛాయకి తగ్గ రంగుని ఎంపిక చేసుకోవాలి.

image:unsplash

 పౌడర్‌..

ఫౌండేషన్‌ బాగుండాలంటే దానిపై కొద్దిగా పౌడర్‌ని అద్దాల్సిందే. అది కూడా తేలికగా ఉండే ట్రాన్స్‌ల్‌సెంట్‌ పౌడర్‌ని ఉపయోగించాలి. మేకప్‌ బ్రష్‌తో కొంచెం పౌడర్‌ని అద్ది ముఖానికి రాసుకోవాలి.  

image:unsplash

కనుబొమలు..

కనుబొమలు అందంగా, అందమైన ఆకృతిలో ఉండేందుకు వాటర్‌ప్రూఫ్‌ ఐబ్రో జెల్‌ని ఉపయోగించాలి. లేకపోతే ఎక్కువ సేపు ఉండే పోమాడ్‌ని రాసుకోవాలి. ఇవి రెండూ వానలో తడిచినా కనుబొమలను అందంగా ఉంచుతాయి.  

image:unsplash

మెరిసే కళ్లు కావాలా..

వానలోనూ కళ్లు అందంగా కనిపించాలంటే.. వాటర్‌ప్రూఫ్‌ ఐలైనర్లూ, మస్కారా వాడాలి. ఇలాంటివైతే ఐమేకప్‌ను చెక్కుచెదరకుండా ఉంచుతాయి. వర్షంలో తడిచినా ముఖంపై మరకలు పడకుండా సంరక్షిస్తాయి.  

image:unsplash

ఐషాడో..

ఐలైనర్‌ చక్కగా ఉండాలంటే ఐషాడోని ప్రయత్నించండి. ఐలైనర్‌ వేసుకున్నాక దానికి అనుగుణంగా ఐషాడో సీలింగ్‌ని రాసుకోవాలి. ఇది స్మడ్జ్‌ని నివారిస్తుంది. దీని వల్ల వర్షంలో కూడా ఐలైనర్‌ అద్భుతంగా, మీ కళ్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 

image:unsplash

పెదవుల కోసం..

వర్షం పడుతుందంటే లిప్‌స్టిక్‌ పోతుందని భయపడతాం. వాటర్‌ప్రూఫ్‌ లిప్‌స్టిక్‌ని ఎంచుకుంటే ఆ భయం అక్కర్లేదు. రోజంతా గులాబీల్లాగా తాజాగా ఉండే పెదవులు మీ సొంతం. హాయిగా చిరునవ్వుని ఆస్వాదించొచ్చు. 

image:unsplash

బ్లాటింగ్‌ షీట్స్‌..

ఎల్లప్పుడూ బ్యాగ్‌లో బ్లాటింగ్‌ షీట్‌లను ఉంచుకోవాలి. ముఖంపై నీళ్లు పడితే.. వీటితో మేకప్‌ చెదిరిపోకుండా తుడుచుకోవచ్చు. దీంతోపాటు సెట్టింగ్‌ స్ప్రే తప్పక ఉండాల్సిందే. అప్పుడప్పుడూ స్ప్రే చేస్తుంటే ముఖం తాజాగా ఉంటుంది. 

image:unsplash

జాగ్రత్త..

ఎంత వాటర్‌ప్రూఫ్‌ సౌందర్యసాధనాలను వాడినా.. ముఖాన్ని పదేపదే తాకకూడదు. ముఖంపై తరచూ తడుముతూ ఉంటే మేకప్‌ పాడవుతుంది. 

image:unsplash

టచ్‌ అప్‌..

ప్రయాణాల్లో టచ్‌అప్‌ అవసరం పడొచ్చు. ఇందుకోసం మస్కారా, కాంపాక్ట్‌ పౌడర్‌ని వెంట తీసుకెళ్లాలి. వీటితో మీ ముఖం తాజాగా ఉంటుంది. అవసరమనిపించినప్పుడు కొద్దిగా టచ్‌అప్‌ ఇవ్వండి. 

image:unsplash

‘వరల్డ్స్‌ లోన్లీయెస్ట్‌ హౌస్‌’ గురించి తెలుసా?

కళ్ల కింద నల్లటి వలయాలు ఇలా మాయం!

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

Eenadu.net Home