నెటిజన్లకు షాక్‌ ఇచ్చిన మలైకా అరోరా..!

అర్జున్‌ కపూర్‌తో నాలుగేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్న మలైకా ‘ఐ సెడ్‌ ఓకే’ అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. దీంతో నెటిజన్లు త్వరలో వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు భావించారు. 

image:instagrm/malaikaaroraofficial

అయితే తాను ‘ఓకే’ చెప్పింది దేనికో మరో పోస్ట్‌తో వివరణిచ్చిందీ బ్యూటీ. 

image:instagrm/malaikaaroraofficial

మలైకా త్వరలో డిజిటల్‌ బాట పట్టనుందట. ఓటీటీ వేదికలో ‘మూవింగ్‌ ఇన్‌ విత్‌ మలైకా’అనే షో చేసేందుకు ‘ఓకే’ చెప్పినట్లు పోస్ట్‌ పెట్టి నెటిజన్లకు షాక్‌ ఇచ్చింది.

image:instagrm/malaikaaroraofficial

మలైకాకు 1998లో అర్భాజ్‌ ఖాన్‌తో వివాహం కాగా..2017లో విడాకులు తీసుకుంది. ఈమెకు 20 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. 

image:instagrm/malaikaaroraofficial

ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యాన్‌ యాక్షన్‌ హీరో’. అనిరుధ్‌ అయ్యర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓ ప్రత్యేకగీతంలో ఆడి పాడిందట మలైకా.

image:instagrm/malaikaaroraofficial

ఈమె వీడియో జాకీగా పని చేసింది. పదికి పైగా టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించింది. 

image:instagrm/malaikaaroraofficial

This browser does not support the video element.

‘దిల్‌ సే’లో ఛల్‌ ఛయ్య.. ఛయ్యా పాటతో బాగా పాపులరైంది. 2010లో ‘దబంగ్‌’లో మున్నీ బద్నామ్ హూయే.. పాటతో ప్రేక్షకుల మనసు దోచుకుందీ బ్యూటీ.

image:instagrm/malaikaaroraofficial

2012లో ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాలో ‘కెవ్వు కేక’ పాటలో మెరిసిన మలైకా మహారాష్ర్టలోని థానేలో 1973, అక్టోబరు 23న జన్మించింది.

image:instagrm/malaikaaroraofficial

ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫొటోలతో ఇన్‌స్టాలో పోస్ట్‌లు పెడుతుంటుంది మలైకా.. ఈ గ్లామర్‌ బ్యూటీకి 16.6మిలియన్ల ఫాలోవర్లున్నారు. 

image:instagrm/malaikaaroraofficial

ఆమె 2018లో వచ్చిన ‘పఠాకా’లోని హల్లో..హల్లో తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. 

image:instagrm/malaikaaroraofficial

చాలా ఏళ్ల తర్వాత ఓ ఐటమ్‌ పాటతో అదరగొట్టబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. 

image:instagrm/malaikaaroraofficial

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home