జో తర్వాత ఓ భామ అయ్యో రామ
‘జో’తో ప్రేక్షకుల్ని అలరించి.. ‘ఓ భామా అయ్యో రామ’తో తెలుగు తెరకు పరిచయం కానుంది మలయాళీ నటి మాళవికా మనోజ్.
సుహాస్ హీరోగా, రామ్ గోదల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామ’. ఇందులో మాళవికా మనోజ్ హీరోయిన్‌గా అలరించనుంది.
కేరళలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మాళవిక సౌదీ అరేబియాలోని జెడ్డాలో పెరిగింది.
జెడ్డాలోని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది.
డ్యాన్స్ మీద ఇష్టంతో చిన్నతనంలోనే శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకుంది. స్టేజ్ ప్రదర్శనలూ ఇచ్చింది ఈ భామ.
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన మాళవిక తొలిసారి ‘ప్రకాశన్ పరకట్టే’ అనే మలయాళ సినిమాతో వెండి తెరపై కనిపించింది.
షూటింగ్ నుంచి విరామం దొరికితే కుంచె పట్టి పెయింటింగ్స్ వేస్తూ ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది.
‘జో’తో అటు కోలీవుడ్, మాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ నాయిక.
‘తీరిక దొరికితే ఫ్రెండ్స్‌తో కలిసి మిడ్ నైట్ మంచురియా, చికెన్ బిర్యానీ లాగించేస్తా’ అంటోంది మాళవిక.