మాలీవుడ్‌ హీరోయిన్‌కి టాలీవుడ్‌లో వరుస ఆఫర్‌లు!

తెలుగులో నేరుగా ఇప్పటివరకు ఒక్క సినిమా చేయకపోయినా మాళవిక మోహనన్‌ టాలీవుడ్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది.

Image:Instagram/Malavika Mohanan

ఈమెను హీరోయిన్‌గా తీసుకునేందుకు టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

Image:Instagram/Malavika Mohanan

ఇప్పటికే ప్రభాస్‌ - మారుతి కలయికలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా మాళవిక ఛాన్స్‌ కొట్టేసినట్టు పరిశ్రమ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

Image:Instagram/Malavika Mohanan

బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘రాక్షసుడు’.. సీక్వెల్ ‘రాక్షసుడు 2’లో ఆమెని తీసుకునేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.

Image:Instagram/Malavika Mohanan

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ మాలీవుడ్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘పట్టం పొలె’తో కెరీర్‌ని ఆరంభించింది.

Image:Instagram/Malavika Mohanan

కేరళలోని కన్నూర్‌ జిల్లా పయ్యనూర్‌లో 1993 ఆగస్టు 4న జన్మించింది. ముంబయిలోని విల్సన్ కాలేజీలో మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది.

Image:Instagram/Malavika Mohanan 

ఇంతకీ ఈ బ్యూటీ ఎవరనుకుంటున్నారు.. మలయాళ, హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన కె.యు.మోహనన్ కుమార్తె. Image:Instagram/Malavika Mohanan 

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ‘పేటా’ చిత్రంతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మాళవికా మోహన్‌ ఓ కీలకపాత్ర పోషించింది.

Image:Instagram/Malavika Mohanan

‘పేటా’ విజయంతో విజయ్‌ హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్‌’ చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. 2022లో విడుదలైన ‘మారన్‌’లో ధనుష్‌ సరసన నటించింది.

Image:Instagram/Malavika Mohanan

ఈ అందాల తారకు తెలుగు నటుడు మహేష్‌బాబుతో కలిసి నటించాలని ఉందట. ఈ విషయాన్ని ఓ సారి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

Image:Instagram/Malavika Mohanan  

ప్రస్తుతం ఆమె హిందీలో ‘యుధ్రా’ అనే చిత్రంలో నాయికగా నటిస్తోంది. ‘గల్లీ బాయ్’ నటుడు సిద్ధాంత్‌ చతుర్వేది కథానాయకుడు.

Image:Instagram/Malavika Mohanan

మాళవిక హిందీలో తొలిసారిగా మాజిద్ మజిది దర్శకత్వం వహించిన ‘బియాండ్‌ ది క్లౌడ్స్’లో కథానాయికగా నటించింది.

Image:Instagram/Malavika Mohanan

బుల్లితెరపై వచ్చిన ‘మసాబా మసాబా’ అనే ధారావాహికలో ప్రత్యేక పాత్రలో కనిపించింది.

Image:Instagram/Malavika Mohanan

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home