స్టార్‌ హీరోల సరసన మలయాళీ బ్యూటీ!

మలయాళీ భామ మాళవిక మోహనన్‌కు సొంత ఇండస్ట్రీలో కన్నా.. ఇతర భాషల్లో అవకాశాలు క్యూ కడుతున్నాయి.

Image: Instagram/Malavika Mohanan

తాజాగా కోలీవుడ్‌లో విక్రమ్‌ 61వ చిత్రంలో మాళవికను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Image: Instagram/Malavika Mohanan

మొదట విక్రమ్‌కు జోడీగా రష్మిక మందానను అనుకున్నారట. కానీ, ఆమెకు కాల్షీట్స్‌ సర్దుబాటుకాకపోవడంతో మాళవికను సంప్రదించింది చిత్రబృందం.

Image: Instagram/Malavika Mohanan

మరోవైపు టాలీవుడ్‌లో ప్రభాస్‌-మారుతీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలోనూ మాళవిక హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. మరికొందరు తెలుగు దర్శక నిర్మాతలూ ఆమెను సంప్రదిస్తున్నారట.

Image: Instagram/Malavika Mohanan

కేరళలోని పయ్యనూర్‌లో జన్మించిన మాళమిక.. ముంబయిలో పెరిగింది. మాస్‌ మీడియాలో డిగ్రీ పట్టా అందుకుంది.

Image: Instagram/Malavika Mohanan

తండ్రి కే.యూ మోహనన్‌ సినిమాటోగ్రాఫర్‌. దీంతో చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది.

Image: Instagram/Malavika Mohanan

చదువు పూర్తి కాగానే పలు యాడ్స్‌లో నటించిన ఈ భామ.. 2013లో మలయాళీ చిత్రం ‘పట్టం పోలే’తో తెరంగేట్రం చేసింది.

Image: Instagram/Malavika Mohanan

కోలీవుడ్‌లో ‘పేట్టా’, ‘మాస్టర్‌’, ‘మారన్‌’లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్‌లోనూ ఓ వెబ్‌సిరీస్‌తోపాటు, మ్యూజిక్‌ ఆల్బమ్‌లో తళుక్కుమంది.

Image: Instagram/Malavika Mohanan

తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమాలో నటించలేదు. అయినా, ఇక్కడ మాంచి క్రేజ్‌ సంపాదించుకుంది.

Image: Instagram/Malavika Mohanan

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవిక.. తన హాట్‌ ఫొటోషూట్స్‌ను షేర్‌ చేస్తుంటుంది. ఆమె అందానికి కుర్రకారు ఫిదా అవుతోంది.

Image: Instagram/Malavika Mohanan

మాళవికకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఎక్కడ ప్రకృతి అందాలు కనిపించినా అక్కడ ఫొటోలు దిగుతూ సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుంటుంది.

Image: Instagram/Malavika Mohanan

ప్రస్తుతం మాళవిక ‘క్రిస్టీ’ అనే మలయాళ చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఆ సినిమా విడుదల కానుంది.

Image: Instagram/Malavika Mohanan

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home