అప్పుడు ‘నెమలి’లా ఆడాలనిపిస్తుంది

‘ఓం భీమ్‌ బుష్‌’తో టాలీవుడ్‌కు పరిచయమై, ‘కన్నప్ప’లో చెంచు యువరాణి ‘నెమలి’గా ప్రేక్షకుల్ని అలరించనుంది ప్రీతి ముకుందన్‌.

మంచు విష్ణు హీరోగా, ప్రీతీ ముంకుందన్‌ హీరోయిన్‌గా ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ ఏప్రిల్‌ 25న విడుదల కానుంది.

నటనకు ప్రాధాన్యమిచ్చే ప్రీతి ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తి సాములో శిక్షణ తీసుకుంది. 

కెరీర్‌ తొలిరోజుల్లో మోడలింగ్‌ చేసిన ప్రీతి ‘ముత్తు ము 2’, ‘ఆసకూడు’ వంటి తమిళ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో ఆడిపాడింది. 

‘నటి, మోడల్‌ని కాకముందు క్లాసికల్‌ డ్యాన్సర్‌ని. నటిగా ఏ స్థాయిలో ఉన్నా.. శాస్త్రీయ నృత్యాన్ని విడిచిపెట్టను’ అంటూ డ్యాన్స్ పై తన ఇష్టాన్ని తెలిపింది ప్రీతి.

బాద్‌షా, శర్వి యాదవ్‌ స్వరపరిచిన ‘మోర్నీ’ హిందీ మ్యూజిక్‌ ఆల్బమ్‌లో ప్రీతి తన అందచందాలతో అదిరే స్టెప్పులేసి క్రేజ్‌ సంపాదించుకుంది.

‘ఖాళీ దొరికితే ప్రకృతి ఒడిలో సేద తీరాల్సిందే. ఆ అందాలను కెమెరాతో క్లిక్‌మనిపించాల్సిందే. అందులో ఉండే ఫీలే వేరు’ అంటోంది ప్రీతి.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రీతి తక్కువ సినిమాలే చేసినా ఇన్‌స్టాలో 15 లక్షలమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.

‘వర్షం పడే ముందు ఆకాశం మేఘామృతమై ఉంటుంది. అప్పుడు నెమలిలా నాకిష్టమైన ‘కళింగ నృత్యం’ చేస్తుంటా’ అని చెప్పింది.

‘మై నే ప్యార్ కియా’తో మలయాళ పరిశ్రమలోనూ అడుగుపెడుతోంది.

కన్నప్ప లుక్స్‌ చూశారా..!

‘టచ్‌లో ఉండమంటూ..’ చంద్రికా రవి గురించి తెలుసా?

చైనాలో మన సినిమాల వసూళ్లు

Eenadu.net Home