తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడు అంటే బాలీవుడ్‌ నటుడే. ఇప్పుడు.. మలయాళ నటుడు అనేంతగా పరిస్థితి మారింది. పేరున్న హీరోనైనా సరే విలన్‌గా చూపించేందుకు టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మరి, తెలుగు హీరోలతో తలపడిన వారెవరంటే..

సుదేవ్‌ నాయర్‌..

నితిన్‌, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ తెరకెక్కించిన ‘ఎక్స్‌ట్రా’లో విలన్‌ ఇతడే. సినిమా ఈనెల 8న విడుదలవుతుంది. ఇంతకుముందు ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో నటించాడాయన.

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

ఈ హీరో ‘సలార్‌’తో టాలీవుడ్‌కు విలన్‌కు పరిచయమవుతున్నారు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 22న రిలీజ్ అవుతుంది.

ఫహాద్‌ ఫాజిల్‌

‘పుష్ప1’లో భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం ‘పుష్ప2’తో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్‌ హీరో. సినిమా విడుదల తేదీ: 2024 ఆగస్టు 15.

జోజు జార్జ్‌

‘ఆదికేశవ’లో ప్రతినాయకుడు ఈయనే. వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది.

హరీశ్‌ పేరడి

ఈయన.. రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో విలనిజం ప్రదర్శించారు. గతంలో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’, ‘స్పైడర్‌’లో నటించారు.

షైన్‌ టామ్‌ చాకో

నాని ‘దసరా’, నాగశౌర్య ‘రంగబలి’లో ఈయన నెగెటివ్‌ పాత్ర పోషించి మెప్పించారు. 

ఆయనే నా డ్యాన్స్‌ టీచర్‌

మేనమామే అయినా 17 సార్లు ఆడిషన్‌ ఇచ్చింది!

యూట్యూబ్‌ నుంచి కేన్స్‌ దాకా..

Eenadu.net Home