‘పొట్టేలు’ నాయిక అనన్య నాగళ్ల

‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. తనదైన పాత్రల ఎంపికతో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల.. ‘పొట్టేలు’తో అలరించేందుకు సిద్ధమైంది.

‘పొట్టేలు’ హీరో యువ చంద్ర. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. పక్కా పల్లెటూరి వాతావరణంలో సాగుతుందీ కథ. 

ఇటీవల ‘తంత్ర’లో తన నటనతో ఆకట్టుకుంది అనన్య. ఇది హారర్‌ చిత్రం. ప్రస్తుతం ‘శ్రీకాకుళం షెర్‌లాక్‌హోమ్స్’ అనే చిత్రంలోనూ నటిస్తోంది.

‘ప్లేబ్యాక్’, ‘వకీల్‌ సాబ్‌’, ‘మాస్ట్రో’, ‘ఊర్వశివో రాక్షసివో’, ‘శాకుంతలం’, ‘మళ్లీ పెళ్లి’, ‘అన్వేషి’ తదితర చిత్రాల్లో నటించింది.

This browser does not support the video element.

ఈ బ్యూటీ తెలంగాణలోని సత్తుపల్లిలో జన్మించింది. న్యాయవిద్యను అభ్యసించింది. ‘షాదీ’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ ద్వారా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 

‘ఒక్కసారి రేస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. నేను ఈ పనులే చేస్తాను.. ఇలాగే ఉంటాను.. అని చెప్పకూడదు. అందుకే గ్లామర్‌ లుక్స్‌లో కనిపించేందుకు కూడా సిద్ధమయ్యానని ఓ సందర్భంలో తెలిపింది.

This browser does not support the video element.

అనన్యకి.. కొత్త ప్రాంతాలకు వెళ్లడం బాగా నచ్చుతుంది. ఎప్పుడూ ఉన్న చోటే ఉంటే బోర్‌ కొడుతుంది. అప్పుడప్పుడూ అలా వెళ్లొస్తుంటే.. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండొచ్చంటోంది.  

ఈమెకు ఫొటోషూట్లంటే మహా ఇష్టం. తరచూ విభిన్నమైన దుస్తులు ధరించి తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ ఉంటుంది.  

 ‘మనది కాని వస్తువు కోసం ఎంతగా మదన పడినా మనకు దక్కదు. అదే మనకి రాసి పెట్టి ఉంటే ఎప్పటికైనా మన దగ్గరికే వస్తుంది’ అని అంటోంది.

This browser does not support the video element.

 ‘యోగా, బాక్సింగ్‌ ఇవి రెండూ నాకు ఎంతో సంతోషాన్నిస్తాయి. ఎంత సమయం యోగా చేసినా అస్సలు బోర్‌ అనిపించదు’ అని చెబుతోంది బ్యూటీ.

వాహ్వా.. వహీదా..!

గిటార్‌ ఇష్టం... బన్నీ ఇంకా ఇష్టం

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home