టాలీవుడ్‌లోకి మన ‘మిస్ ఇండియా’?
‘మిస్ యూనివర్స్’ సుస్మితాసేన్‌తో కలిసి ‘రక్షకుడు’లో నటించారు కింగ్ నాగార్జున. ఆయన తాజా చిత్రంలో ‘మిస్ ఇండియా’ మానస వారణాసి కథానాయికగా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Image : Manasa varanasi
మానస 2020లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించి మిస్ ఇండియా విజేతగా నిలిచింది. 2021 మిస్ వరల్డ్ పోటీల్లో భారత్‌కు పాతినిధ్యం వహించింది.
Image : Manasa varanasi
తనకు ప్రియాంక చోప్రా అంటే ఎంతో అభిమానమని ఓ సందర్భంలో చెప్పింది. ఆమె బహుముఖ ప్రజ్ఞ, ధైర్యం చూసి తాను ప్రేరణ పొందానని తెలిపింది.
Image : Manasa varanasi
అంతేకాకుండా బామ్మ, అమ్మ, సోదరి.. ఈ ముగ్గురు మహిళలు తన జీవితంలో ఎంతో స్ఫూర్తినింపిన వ్యక్తులని మానస ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
Image : Manasa varanasi
మానస వారణాసి హైదరాబాద్‌లోనే పుట్టింది. తండ్రి ఉద్యోగరీత్యా మలేసియా వెళ్లడంతో అక్కడే గ్లోబల్ ఇండియన్ స్కూల్‌లో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది. తరువాత మళ్లీ హైదరాబాద్ వచ్చి వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో డిగ్రీ చదివింది.
Image : Manasa varanasi
ఫ్యాషన్ రంగంపై సరైన అవగాహన లేని సమయంలోనే కళాశాలలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తరువాత నుంచి మోడలింగ్ రంగంపై దృష్టి సారించింది.
Image : Manasa varanasi
‘మిస్ ఇండియా’ కిరీటం దక్కించుకున్న తరువాత ఓ అనాథాశ్రమానికి వెళ్లి తన గొప్పమనసును చాటుకుంది. కొంతసేపు వారితో సరదాగా గడిపింది.
Image : Manasa varanasi
మానసకు చెవిటివారు వాడే సంకేత భాష కూడా వచ్చు. కళ్లతో చూస్తూ ఎదుటి వారు వ్యక్తపరిచే భావాలను అర్థం చేసుకోవడం మంచి అనుభూతినిస్తుందని ఆమె పేర్కొంది.
Image : Manasa varanasi
ఈ ముద్దుగుమ్మకు పుస్తకాలు, సంగీతం, డ్యాన్స్, యోగా అంటే చాలా ఇష్టం. ఈమె చాలా సిగ్గరి అని సన్నిహితులు చెబుతుంటారు.
Image : Manasa varanasi
మానసకు ఇన్‌స్టాలో 2.5లక్షల ఫాలోవర్లున్నారు. తన వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన పలు ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది.
Image : Manasa varanasi
హాలీడే దొరికితే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లడానికి మానస ఆసక్తి కనబరుస్తుంటుంది. చదువు పూర్తయిన తరువాత నుంచి ఆమె ఓ ప్రసిద్ధ కంపెనీలో ఫైనాన్షియల్ ఇన్‌ఫర్మేషన్ ఎక్సేంఛ్ అనలిస్టుగా పనిచేస్తోంది.
Image : Manasa varanasi