ప్రేమలో పడ్డ మంజిమా మోహన్‌

తెలుగు, తమిళం, మలయాళ సినిమాలతో ఆకట్టుకుంటున్న కేరళ అందం మంజిమా మోహన్‌ ప్రేమలో పడింది.

Image: Twitter/Manjima Mohan

తమిళ నటుడు గౌతమ్‌ కార్తిక్‌(నటుడు కార్తిక్‌ కుమారుడు, కడలి ఫేం)తో ప్రేమలో ఉన్నట్లు తాజాగా వెల్లడించింది.

Image: Twitter/Manjima Mohan

గత కొన్నాళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు గుసగుసలు వినిపించాయి. తాజాగా ఆ విషయాన్ని ఇద్దరు కలిసి ప్రకటించారు. 

Image: Twitter/Manjima Mohan 

గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సాహసం శ్వాసగా సాగిపో’తో తెలుగు తెరకు పరిచయమైంది మంజిమ. 

Image: Twitter/Manjima Mohan

ఆ తర్వాత ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిగా కనిపించింది. ఈ పాత్ర ఆమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. 

Image: Twitter/Manjima Mohan

మంజిమ 1993 మార్చి 11న కేరళలోని తిరువనంతపురంలో పుట్టింది. బాల నటిగా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించింది.

Image: Twitter/Manjima Mohan 

ఆమె నటనకు కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ బాల నటి అవార్డు దక్కింది. బుల్లితెరపై యాంకర్‌గా కూడా పనిచేసింది.

Image: Twitter/Manjima Mohan

మాలీవుడ్‌లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ విపిన్‌ మోహన్‌ గారాల పట్టే మంజిమ. చెన్నై స్టెల్లా మేరీ కాలేజీలో బీఎస్సీ చదివింది. 

Image: Twitter/Manjima Mohan

2015లో నివీన్‌ పౌలితో కలిసి ‘ఒరు వడక్కన్‌ సెల్ఫీ’తో తెరంగేట్రం చేసింది. సినిమాలపై ఎంతో ఇష్టం ఉన్నా తెరపై కనిపించేంత ఆత్మవిశ్వాసం మొదట్లో తనలో ఉండేది కాదట.

Image: Twitter/Manjima Mohan 

‘ఒరు వడక్కన్‌ సెల్ఫీ’ బ్లాక్‌ బస్టర్‌ కాగా తన నటనతో గౌతమ్‌ మీనన్‌ను ఇంప్రెస్‌ చేసింది. అలా ‘సాహసం శ్వాసగా సాగిపో’లో నాగ చైతన్యతో జోడీ కట్టింది. 

Image: Twitter/Manjima Mohan

ఇదే చిత్రానికి తమిళ్‌ వెర్షన్‌లో శింబు సరసన నటించింది. ఈ సినిమాతో మంజిమ ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది. 

Image: Twitter/Manjima Mohan

బొద్దుగా ఉండే ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అందుకే, మంచి కథ దొరికితే తెలుగులోనూ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది మంజిమ.

Image: Twitter/Manjima Mohan

రెండేళ్ల కిందట జరిగిన ఓ ప్రమాదంలో మంజిమ కాలుకు తీవ్ర గాయమైంది. కొన్ని నెలలపాటు ఆమె ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో మంజిమ మరింత లావుగా మారిపోయింది.

Image: Twitter/Manjima Mohan

ఆ గడ్డు పరిస్థితుల్ని దాటుకొని మళ్లీ సినిమాలతో బిజీ అవుతోంది. గతేడాది ‘తుగ్లగ్‌ దర్బార్‌’, ‘ఎఫ్‌ఐఆర్‌’ చిత్రాలతో మెప్పించిన ఈ మలయాళీ అందం.. ప్రస్తుతం ‘అక్టోబర్‌ థర్టీ ఫస్ట్‌ లేడీస్‌ నైట్‌’లో నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

Image: Twitter/Manjima Mohan

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home