బోర్ కొడితే.. బైక్ ఎక్కేయడమే!
ముంజు వారియర్.. ఇండస్ట్రీకి వచ్చి 30ఏళ్లు అవుతున్నా తెరపై అదే జోరుతో అదరగొడుతోంది. తాజాగా ‘వేట్టయాన్’లో రజనీకాంత్ సరసన స్టెప్పులతో హైలైట్‌గా నిలిచింది.
జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘వేట్టయాన్’ అక్టోబరు 10న విడుదల కానుంది.
మలయాళంలో 35 సినిమాలకు పైగా నటించి మెప్పించిన మంజు వారియర్.. తమిళంలోనూ నటించింది. ‘అమ్రికీ పండిట్’తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది.
1995లో ‘సాక్ష్యం’తో మలయాళ పరిశ్రమలో అడుగు పెట్టిన మంజు.. ఏటా కనీసం నాలుగు సినిమాలతో బిజీగా ఉంటోంది.
ఈ ఏడాది ఇప్పటికే మలయాళంలో ‘ఫుటేజ్’ విడుదల కాగా తమిళంలో ‘మిస్టర్ ఎక్స్’, ‘విడుదలై 2’, ‘వేట్టయాన్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఎల్2: ఎంపురాన్’ షూటింగ్ దశలో ఉంది.
వరుస ఆఫర్లతో కెరీర్ పరుగులు పెడుతున్న సమయంలో 1999లో హీరో దిలీప్‌ను వివాహమాడింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది.
15 ఏళ్ల తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఒక్కగానొక్క కుమార్తె కూడా తండ్రితోనే ఉంటానని చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురైంది.
తిరిగి 2014లో ‘హౌ ఓల్డ్ ఆర్ యూ’తో రీఎంట్రీ ఇచ్చింది మంజు. అప్పటి నుంచి అదే జోరును కొనసాగిస్తోంది.
మంజుకి మొక్కలు పెంచడం నచ్చుతుంది. అది మనసుకు ప్రశాంతతను కలిగిస్తుందని అంటోంది. ఇన్‌స్టాలో ఈమెకి 35లక్షల మంది ఫాలోవర్లున్నారు.
బైక్ రైడింగ్ అంటే ఈ భామకి బాగా ఇష్టం. ఒత్తిడి, చిరాకు అనిపించినప్పుడల్లా బైక్‌పై చక్కర్లు కొడుతుందట.
ఫిట్‌గా ఉండేందుకు జిమ్, యోగా చేస్తుంది. ‘మనల్ని వెనక ఉండి ప్రోత్సహించడానికి ఎవరూ ఉండరు. మీకు మీరే వెన్ను తట్టుకుంటూ ఉండాలి’ అంటోంది మంజు.