మళ్లీ వస్తోన్న మన్నారా!

టాలీవుడ్‌ చిత్రం ‘ప్రేమా గీమా జాన్తా నై’తో తెరంగేట్రం చేసింది.. బీటౌన్‌ బ్యూటీ మన్నారా చోప్రా. రెండేళ్ల తర్వాత మళ్లీ ‘తిరగబడరసామీ’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

రాజ్‌తరుణ్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ఎ.ఎస్‌ రవికుమార్‌ చౌదరి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మన్నారాతోపాటు మరో కథానాయికగా మాల్వీ మల్హోత్రా నటిస్తోంది. 

ఈ చిత్రంలోని ‘బాయ్‌ బాయ్‌ రాధాబాయి..’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సాంగ్‌ను ప్రత్యేకంగా మన్నారాపై చిత్రీకరించారు. ప్రస్తుతం నెట్టింట ట్రెండ్‌ అవుతోంది.

తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించిన మన్నారా.. పలు వీడియో ఆల్బమ్స్‌లోనూ మెరిసింది. ‘ఓహి ఛాన్న్‌ ఓహి రాతన్‌’తో పంజాబీ చిత్రసీమలోనూ ఎంట్రీ ఇవ్వనుంది.

2014లో ‘ప్రేమా గీమా జాన్తా నై’ తర్వాత అదే ఏడాది బాలీవుడ్‌ ‘జిద్‌’లో నటించింది. ‘సండమారుతమ్‌’, ‘కావల్‌’, ‘జక్కన్న’, ‘తిక్క’, ‘రోగ్’, ‘సీత’, ‘హై ఫైవ్‌- ఫన్‌ అండ్‌ గన్‌’ తదితర చిత్రాల్లో మెరిసింది. 

సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా, అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించింది. ఇప్పటికీ పలు ఫ్యాషన్‌ షోల్లో షోస్టాపర్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.

సినిమా అవకాశాలు తగ్గుతోన్న సమయంలో హిందీ బిగ్‌బాస్‌ నుంచి పిలుపొచ్చింది. సీజన్‌ 17లో పాల్గొని అత్యధిక పారితోషికం అందుకుంది. తోటి కంటెస్టెంట్‌తో పోటీ పడి సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది.

బిగ్‌బాస్‌ టెలికాస్ట్‌ అవుతున్న సమయంలో ఈమె నెట్టింట్ట ఫుల్‌ ట్రెండింగ్‌లో ఉండేది. ఈ షో ద్వారా పాపులారిటీనే కాకుండా చాలా మంది అభిమానుల్ని సంపాదించుకుంది.

ఈమెకు గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, బాలీవుడ్‌ తారలు పరిణీతి చోప్రా, మీరా చోప్రా కజిన్స్‌ అవుతారు. అయినా.. తన ప్రతిభతోనే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటోంది. 

This browser does not support the video element.

కథక్‌, హిప్‌హాప్‌, బెల్లీ డ్యాన్స్‌లోనూ ప్రావీణ్యం ఉంది. మన్నారా మంచి సింగర్‌ కూడా. 2023లో ‘జరా జరా బెహెక్తా హై’ కవర్‌సాంగ్‌ పాడింది. తన గాత్రానికి ప్రశంసలు దక్కాయి.

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ

గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

Eenadu.net Home