టాలీవుడ్‌పై మనసుపడ్డ మాజీ మిస్‌వరల్డ్!
This browser does not support the video element.
బాలీవుడ్‌లో ‘పృథ్వీరాజ్’తో వెండితెరకి పరిచయమైన మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్.. మనసు ఇప్పుడు టాలీవుడ్‌వైపు మళ్లింది.
image:Instagram/manushi_chhillar
వరుణ్‌తేజ్ కొత్త చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. యథార్థ సంఘటనల ఆధారంగా, వైమానిక దళం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. దీనికి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. image:Instagram/manushi_chhillar
మానుషి.. 1997 మే 14న హరియాణాలో జన్మించింది. వైద్య విద్యను అభ్యసించింది. ఆమె తల్లిదండ్రులూ వైద్యులే.
image:Instagram/manushi_chhillar
This browser does not support the video element.
మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకోవాలనేది తన చిన్ననాటి నుంచి ఉన్న కోరికట. ఆ కలను 2017లో నెరవేర్చుకుంది. ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకొన్న 6వ భారతీయురాలీమె! image:Instagram/manushi_chhillar
This browser does not support the video element.
ప్రియాంక చోప్రా 2000లో ప్రపంచ సుందరిగా నిలిచింది. పదిహేడేళ్ల తర్వాత మిస్ వరల్డ్ కిరీటాన్ని మళ్లీ మన మానుషి చిల్లర్ సొంతం చేసుకుంది.
image:Instagram/manushi_chhillar
మిస్ ఇండియా కిరీటం గెలిచినప్పటి నుంచి ‘ప్రాజెక్టు శక్తి’లో భాగంగా మహిళలకు నెలసరి సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
image:Instagram/manushi_chhillar
This browser does not support the video element.
ఆ అందగత్తె కిరీటం దక్కించుకున్న వాళ్లకి సహజంగానే సినీ అవకాశాలు వస్తుంటాయి. మానుషికి నటనపై ఆసక్తి ఉండటంతో అటుగా అడుగులు వేసింది.
image:Instagram/manushi_chhillar
This browser does not support the video element.
ఆమె తొలి చిత్రం ‘పృథ్వీరాజ్’ ఇటీవల విడుదలై.. ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది. అయినా.. ఆ చిత్రంలో రాణి సంయోగిత పాత్రలో ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి.
image:Instagram/manushi_chhillar
మానుషికి షికార్లంటే ఎంతో ఇష్టం. సమయం దొరికితే.. విదేశాల్లో చెక్కర్లు కొట్టేందుకు సిద్ధమవుతుంది.
image:Instagram/manushi_chhillar
ఈ అందాల భామకు స్కూబా డైవింగ్, బంగీజంప్‌లంటే చాలా ఇష్టమట! image:Instagram/manushi_chhillar
This browser does not support the video element.
తరచూ తన హాట్ ఫొటోలను షూట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈమెకు ఇన్‌స్టాలో 6.4 మిలియన్ల ఫాలోవర్లున్నారు.
image:Instagram/manushi_chhillar