మారుతీ సుజుకీ కొత్త స్విఫ్ట్‌ విశేషాలివీ..

దేశీయంగా అధిక ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ కార్లలో ఒకటైన స్విఫ్ట్‌లో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను మారుతీ సుజుకీ మే9న ఆవిష్కరించింది.

కొత్త స్విఫ్ట్‌ ధరల శ్రేణి రూ.6.50 లక్షల నుంచి రూ.9.65 లక్షల వరకు ఉంది. 

ఈ కారు అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లుంటాయి.

80bhp గరిష్ఠ శక్తితో పాటు 112 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది.

స్విఫ్ట్‌లో కొత్తగా 1.2 లీటర్‌ 3 సిలిండర్‌ జెడ్‌ సిరీస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను మారుతీ తీసుకొచ్చింది.

5-స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 5-స్పీడ్‌ ఏఎంటీ గేర్‌బాక్స్‌ ఇందులో ఉంది. 

 లీటరుకు 25.75 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది.

లోపలిభాగంలో ఫ్రాంక్స్‌, బ్రెజా, బాలెనో తరహాలో ప్రీమియం లుక్ వచ్చేలా క్యాబిన్‌ను తీర్చిదిద్దారు.

 టాప్‌ ఎండ్‌ మోడల్‌లో 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌, 360 డిగ్రీ కెమెరా, హెడ్‌-అప్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఛార్జింగ్, వెనక భాగంలో ఏసీ వెంట్స్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home