సోషల్‌ సెన్సేషన్‌ రియా ఎవరు?... ఇదిగో ఈమెనే!

‘మత్తు వదలరా 2’లో అందం అంటే మొన్నీమధ్య వరకు ఫరియా అబ్దుల్లానే. కానీ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత ఇషా యాదవ్‌ అనే అమ్మాయి వైరల్‌గా మారింది.  

ఇషా యాదవ్‌ అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ ‘మత్తు వదలరా’ రియా అంటే తెలిసిపోతుంది. ‘రియా ఎవరు?’ అంటూ ఓ క్లిప్‌, రీల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

దీంతో రియా ఎవరు అంటూ కొందరు.. రియాగా నటించింది ఎవరు అంటూ మరికొందరు వెతకడం స్టార్ట్‌ చేశారు. అలా ఆ బ్యూటీ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అని తేలింది.

ఇషా 1999లో దిల్లీలో పుట్టింది. చదువంతా స్థానికంగానే సాగింది. చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌ మీద ఉన్న ఆసక్తితో శిక్షణ తీసుకుంది.

మిడిల్ క్లాస్‌ కుటుంబానికి చెందిన ఇషా యూట్యూబ్‌ షార్ట్స్‌, వీడియోల ద్వారా కెరీర్‌ మొదలుపెట్టింది.

2022లో ఇషా యాదవ్‌ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టింది. ఆ ఛానల్‌కు దాదాపు 19 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. 

‘మత్తు వదలరా 2’కి ముందు తెలుగు యూట్యూబ్‌ ఫిల్మ్స్‌లో నటించింది. ‘సిద్ధూ బికామ్‌’ అనే సిరీస్‌ ద్వారా నెటిజన్లకు పరిచయమే.

ఫన్నీ రీల్స్‌, డ్యాన్స్‌ వీడియోలతో ఇన్‌స్టాలో 8 లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుంది. 

లెహంగాలు, నగలు ధరించడం అంటే ఈ బ్యూటీకి ఇష్టం. ఇన్‌స్టాలో లైక్‌లు, కామెంట్లు ఆ ఫొటోలకే ఎక్కువ.

స్నేహితులను కలిస్తే.. టాప్‌ లేచిపోయే సందడి చేస్తుంటుంది. పార్టీలు, ట్రిప్పుల్లో ఎంజాయ్‌ చేయడం నచ్చుతుందట.

గూగుల్‌లో అత్యధికంగా వెతికింది వీరి కోసమే!

కేతిక.. అది దా మ్యాటరు!

నెట్టింట కొత్త కోడలి సందడి..!

Eenadu.net Home