ఈ నంబర్లకు అర్థమేంటో తెలుసా?

వాహనం, పాన్‌కార్డ్‌, గ్యాస్‌ సిలిండర్‌, రైలు బోగీ వంటివాటికి ప్రత్యేకంగా ఒక గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ, వాటికి అర్థమేంటో తెలుసా?

వాహనం రిజిస్ట్రేషన్‌ 

తొలి రెండు అక్షరాలు వాహనం రిజిస్ట్రేషన్‌ జరిగిన రాష్ట్రాన్ని, ఆ తర్వాత రెండు అంకెలు జిల్లాను, అనంతరం ఉన్న రెండు అక్షరాలు రిజిస్ట్రేషన్‌ సిరీస్‌ను సూచిస్తాయి. చివరి నాలుగు అంకెలు వాహనానికి ఇచ్చే ప్రత్యేక గుర్తింపు సంఖ్య. 

పాన్‌కార్డ్‌

మొదటి మూడు అక్షరాలు AAA to ZZZ సిరీస్‌లో ఉంటాయి. నాలుగో అక్షరం పన్ను చెల్లింపుదారు ఎవరనేది తెలియజేస్తుంది. ఐదో అక్షరం.. పాన్‌కార్డ్‌ హోల్డర్‌ ఇంటిపేరులోని మొదటి అక్షరం. ఆ తర్వాత నాలుగు అంకెలు 0001 to 9999 సిరీస్‌లో ఉంటాయి. చివరి అక్షరం కూడా సిరీస్‌లో భాగమే.

రైలు బోగీ

రైలు బోగీపై కనిపించే ఐదు అంకెల్లో తొలి రెండు అంకెలు బోగీని తయారు చేసిన సంవత్సరాన్ని సూచిస్తాయి. ఆ తర్వాతి అంకెలు బోగీ రకాన్ని తెలియజేస్తాయి. 1-200 మధ్య ఉంటే ఏసీ బోగీలు, 200-700 మధ్య ఉంటే స్లీపర్‌ బోగీలు, 700-800 మధ్య ఉంటే లగేజ్‌ కోచ్‌లుగా భావించాలి. 

గ్యాస్‌ సిలిండర్‌

దీనిపై కనిపించే ABCDలకు అర్థం.. నాలుగు త్రైమాసికాలు(A జనవరి - మార్చి, B ఏప్రిల్‌ నుంచి జూన్‌, C జులై నుంచి సెప్టెంబర్‌, D అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌) అని. పక్కన కనిపించే నంబర్‌ సిలిండర్‌ను పరీక్షించాల్సిన ఏడాదిని సూచిస్తుంది. 

పిన్‌కోడ్‌

దేశంలో సౌత్‌, ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌ అంటూ మొత్తం తొమ్మిది జోన్లు ఉన్నాయి. ఆరు అంకెల పిన్‌కోడ్‌లో తొలి అంకె జోన్‌ను, రెండో అంకె సబ్‌జోన్‌ను, మూడో అంకె జిల్లాను, చివరి మూడు అంకెలు పోస్ట్‌ ఆఫీస్‌కి కేటాయించిన నంబర్‌ను సూచిస్తాయి.

బంగారు ఆభరణాలు

ఆభరణంపై కనిపించే లోగో బీఐఎస్‌ స్టాండర్డ్‌ మార్క్‌, ఆ తర్వాత కనిపించే నంబర్‌.. బంగారం నాణ్యతను తెలియజేస్తుంది. ఆ పక్కన ఉండే నంబర్‌.. ప్రతి ఆభరణానికి ప్రత్యేకంగా కేటాయించే హాల్‌మార్క్‌ యూనిక్‌ కోడ్‌. కొనేముందు ఇవి ఉన్నాయో లేవో తప్పకుండా పరిశీలించాలి. 

టైర్‌

కనిపించే కోడ్‌లో టైర్‌ టైప్‌, కొలతలు, డయామీటర్‌, లోడ్‌ లిమిట్‌ ఇండెక్స్‌, మాగ్జిమమ్‌ స్పీడ్‌ ఇండెక్స్‌ వంటి వివరాలుంటాయి. 

దంపతుల గురించి సుధామూర్తి చెప్పిన సంగతులు..

సాయంత్రం నీరసం దరిచేరకుండా ఇలా చేసి చూడండి

పిల్లలు యాక్టివ్‌గా ఉండాలంటే ఏం చేయాలి?

Eenadu.net Home