యాక్షన్‌ మోడ్‌లో మేధా శంకర్‌

విక్రాంత్‌ మస్సేతో కలిసి ‘12th ఫెయిల్‌’లో నటించి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది నటి.. మేధా శంకర్‌. ఇప్పుడు యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రాజ్‌కుమార్‌ రావు హీరోగా పుల్కిత్‌ దర్శకత్వంలో ఈ యాక్షన్‌ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి ‘మాలిక్‌’ అనే టైటిల్‌ ఖరారు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మేధా విషయానికొస్తే.. 2015లోనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినా.. ‘12th ఫెయిల్‌’తోనే దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది.

అందులో శ్రద్ధా జోషిగా విక్రాంత్‌ ప్రియురాలు, భార్య పాత్రలో కనిపించింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కుర్రకారును ఫిదా చేసింది.

ఈ చిత్రానికిగానూ మేధా బెస్ట్‌ ఫీమేల్‌ డెబ్యూ అవార్డును, బెస్ట్ యాక్ట్రెస్‌ జ్యూరీ కింద ‘2024 పింక్‌ విల్లా స్క్రీన్‌ అండ్‌ స్టైల్‌ ఐకాన్‌’ టైటిల్‌నూ గెలుచుకుంది.  

This browser does not support the video element.

నోయిడాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ నటన మీద ఆసక్తితో ముంబయికి వచ్చింది. కెరీర్‌ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా అని ఓ సందర్భంలో చెప్పింది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందీ బ్యూటీ. ఈమె ఇన్‌స్టా ఖాతాకి ‘12th ఫెయిల్‌’కి ముందు 10 వేల మంది ఫాలోవర్లు ఉంటే.. తర్వాత 20 లక్షలకు పెరిగారు.

ఈమెకు పెంపుడు జంతువులంటే ప్రేమ ఎక్కువ. వాటితో తీసుకున్న ఫొటోలను సోషల్‌ మీడియాలోనూ పంచుకుంటుంది.

ఫిట్‌నెస్‌ కోసం ఆహారం విషయంలో నియమాలు పాటిస్తూ.. క్రమం తప్పకుండా జిమ్‌లో వ్యాయామాలు చేస్తుంటుంది.

This browser does not support the video element.

ఖాళీ సమయం దొరికితే ఎక్కువగా పుస్తకాలు చదువుతుంది. ‘ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతనివ్వడంలో పుస్తకాలు ముందుంటాయి. మీరూ అలవాటు చేసుకోండి’ అంటూ నెటిజన్లకు సలహా ఇచ్చింది.

ట్రెండీ డ్రెస్సుల్లో మెరుస్తూనే.. సంప్రదాయ దుస్తులకూ ప్రాధాన్యత ఇస్తుంది. పండుగలు, ఫంక్షన్ల సమయంలో చీరకట్టుతో సందడి చేస్తుంటుంది.

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

దక్షిణాది చిత్రసీమపై కన్నేసిన అనసూయ

గోల్డెన్‌ బ్యూటీ.. జాన్వీ

Eenadu.net Home